ఆర్య సినిమా నా లైఫ్ టర్న్ చేసిందంటున్న అల్లు అర్జున్... 

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సరిగ్గా 17 సంవత్సరాల క్రితం స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” మరియు ప్రముఖ దర్శకుడు లెక్కల మాస్టర్ “సుకుమార్” ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా తెలుగమ్మాయి అను మెహ్తా నటించగా ప్రముఖ నటుడు శివ బాలాజీ, కమెడియన్ వేణు మాధవ్, సుబ్బ రాజు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Stylish Star Allu Arjun Shares His Cherish Post About Arya Movie-TeluguStop.com

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.కాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ఔరా అనిపించింది.

ఆ తర్వాత ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, మలయాళం, తదితర భాషలలో కూడా రీమేక్ చేశారు.

 Stylish Star Allu Arjun Shares His Cherish Post About Arya Movie-ఆర్య సినిమా నా లైఫ్ టర్న్ చేసిందంటున్న అల్లు అర్జున్… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నేటితో ఈ చిత్రం విడుదలై 17 సంవత్సరాలు కావడంతో ఈ విషయంపై పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందించాడు.

ఇందులో భాగంగా నేటితో తాను హీరోగా నటించిన “ఆర్య” చిత్రం 17 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, అంతేగాక ఈ చిత్రం తన సినీ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఈ చిత్రం తన సినీ కెరీర్ లోనే ఒక అద్భుతమని, ఈ చిత్రానికి దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన సుకుమార్ మరియు దిల్ రాజు అలాగే సంగీత స్వరాలు సమకూర్చిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపాడు.

అలాగే ఈ విషయానికి సంబంధించిన ఓ పోస్టర్ ని కూడా అల్లు అర్జున్ షేర్ చేశాడు.దీంతో కొందరు అల్లు అర్జున్ అభిమానులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.
కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ తెలుగులో “పుష్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో రష్మిక మందన్న, తమిళ ప్రముఖ నటుడు ఫహద్ పైజల్, అనసూయ భరద్వాజ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ “మైత్రి మూవీ మేకర్స్” నిర్మిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.

కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

#Anu Mehta #Allu Arjun #Sukumar #StylishStar #AryaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు