వైరల్: వారితో బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన స్టైలిష్ స్టార్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో స్టైల్ విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఎప్పుడికప్పుడు హెయిర్ స్టైల్స్ మారుస్తూ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ అల్లు అర్జున్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

 Stylish Star Allu Arjun New Hair Style Look Wife Sneha-TeluguStop.com

ఈ సంవత్సరం అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తనకు ఆర్య, ఆర్య 2 లాంటి సక్సెస్ లు ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.

 Stylish Star Allu Arjun New Hair Style Look Wife Sneha-వైరల్: వారితో బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన స్టైలిష్ స్టార్-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో విహారయాత్రకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా బన్నీ ఈ ఫోటోల్లో డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు.అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేశాడు.

ఉంగరాల జుట్టులో అల్లు హీరో సూపర్ గా ఉన్నాడంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ కొత్త లుక్ సినిమా కోసమా…? లేక లాక్ డౌన్ లో కొత్త స్టైల్ ట్రై చేశాడా…? అనే విషయం తెలియాల్సి ఉంది.

మరోవైపు త్వరలో పుష్ప మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.ఎర్రచందనం దుంగల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కు సంబంధించిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

మరోవైపు ఇటీవల జెమిని ఛానెల్ లో అల వైకుంఠపురములో సినిమా ప్రసారం కాగా ఆ సినిమా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ అందుకుంది.అల్లు అర్జున్ స్టైల్ కు త్రివిక్రమ్ మ్యాజిక్ తోడు కావడంతో అల వైకుంఠపురములో బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించింది.

#OutingWith #Wife Sneha #StylishStar #AlluArjun’s #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు