బాలీవుడ్ స్టార్ తో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ మల్టీ స్టారర్.. నిజమేనా!

Stylish Star Allu Arjun Multistarrer With Bollywood Star Shahid Kapoor

బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.అప్పటి నుండి టాలీవుడ్ అందరి దృష్టిలో పడింది.

 Stylish Star Allu Arjun Multistarrer With Bollywood Star Shahid Kapoor-TeluguStop.com

ఇక ఇప్పుడు ప్రసెంట్ అన్ని ఇండస్ట్రీలలో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.మన టాలీవుడ్ లో కూడా మల్టీ స్టారర్ సినిమాల జోరు నడుస్తుంది.

ఇంకా ప్రసెంట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.

 Stylish Star Allu Arjun Multistarrer With Bollywood Star Shahid Kapoor-బాలీవుడ్ స్టార్ తో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ మల్టీ స్టారర్.. నిజమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం విదితమే.

వీరిద్దరిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కించాడని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ చూస్తేనే తెలుస్తుంది.ఇక ఈ సినిమా విడుదల అయ్యాక ఈ సినిమా స్పూర్తితో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కే అవకాశం ఉంది.

ఇక తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో కలిపి మల్టీ స్టారర్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి.అది కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ కలిసి ఈ మల్టీ స్టారర్ సినిమాలో నటించ నున్నారని ప్రచారం జరుగుతుంది.ఇక తాజాగా హిందీలో కూడా జెర్సీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ట్రైలర్ ను ఈ మధ్యనే రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్ రాజు కూడా హాజరయ్యారు.ఈ క్రమంలో అల్లు అరవింద్ ను మీడియా ఒక ప్రశ్న అడిగింది.

బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో కలిపి పాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారా.అని అడగగా ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారు.

అల్లు అరవింద్ సింపుల్ గా నో అని చెప్పకుండా ఇప్పుడు చెప్పే సమయం కాదని.సరైన ప్లేస్ లో ఈ విషయం గురించి చెబుతానని చెప్పుకొచ్చారు.

దీంతో టాలీవుడ్, బాలీవుడ్ మల్టీ స్టారర్ సినిమాల గురించిన చర్చలు మొదలయ్యాయి.అది కూడా అల్లు అర్జున్, షాహిద్ కపూర్ తోమల్టీ స్టారర్ సినిమా ఉండబోతుందని బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.

మరి ఎప్పుడు ఇవి అంతం అవుతాయో చూడాలి.

#StylishArjun #Aravid #Jersey Hindi #Shahid Kapoor #Icon Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube