బ్రహ్మానందంని పరామర్శించిన బన్ని! రియల్ ఐరన్ మెన్ అంటూ కామెంట్!  

Stylish Star Allu Arjun Intact With Brahmanandham After Heart Surgery-allu Arjun Intact With Brahmanandham After Heart Surgery,brahmanandham,brahmanandham After Heart Surgery,stylish Star Allu Arjun

టాలీవుడ్ దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం ఆ మధ్య హార్ట్ స్ట్రోక్ తో ముంబై లో హాస్పిటల్ లో చేరిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత అతనికి హార్ట్ సర్జరీ చేసిన విషయం కూడా తెలిసిందే. హార్ట్ సర్జరీ తర్వాత బ్రహ్మానందం హెల్త్ కండీషన్ బాగుంది అని కుటుంబ సభ్యులు నిర్ధారించిన, ఆయనకి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకి రాలేదు..

బ్రహ్మానందంని పరామర్శించిన బన్ని! రియల్ ఐరన్ మెన్ అంటూ కామెంట్!-Stylish Star Allu Arjun Intact With Brahmanandham After Heart Surgery

అయితే ఆపరేషన్ తర్వాత ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్న బ్రహ్మానందంని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించాడు. అతనిని పరామర్శించిన బన్ని హెల్త్ కండీషన్ అడిగి తెలుసుకున్నారు.

తరువాత బ్రహ్మానందంతో కలిసి ఫోటో తీసుకొని దానిని తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా షేర్ చేస్తూ రియల్ ఐరన్ మెన్, నా కిల్ బిల్ పాండేని చూడటం నాకు చాలా హ్యాపీగా వుంది అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం బ్రహ్మానందం ఆపరేషన్ తర్వాత ఆరోగ్యంగా, వున్నారని స్పష్టం అవుతుంది.

మరల అతి త్వరలో అతనిని వెండితెరపై తన కామెడీతో చూసే అవకాశం వుందని తెలుస్తుంది.