స్టైల్‌ 2 : అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌ సాధ్యమేనా?  

Style 2 Film From Allu Arjun And Ram Charan-ram Charan,style 2,style Movie Sequel,లారెన్స్‌,స్టైల్‌ 2

లారెన్స్‌ కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఆరంభించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా కూడా మారాడు. లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి...

స్టైల్‌ 2 : అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌ సాధ్యమేనా?-Style 2 Film From Allu Arjun And Ram Charan

అందులో ఒకటి స్టైల్‌. ఆ చిత్రంలో లారెన్స్‌ తన గురు సమానుడు అయిన ప్రభుదేవాతో కలిసి నటించాడు. ప్రభుదేవా మరియు లారెన్స్‌ కలిసి నటించిన సినిమా అవ్వడంతో సంచలనం సృష్టించింది.

డాన్స్‌ మూవీగా అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇద్దరి కాంబోలో మూవీ మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

‘స్టైల్‌’ చిత్రంకు సీక్వెల్‌ చేయాలనే డిమాండ్‌ చాలా రోజులుగా ఉంది. అందుకు తగ్గట్లుగా సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

స్టైల్‌ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ కూడా కొన్ని రోజుల క్రితం తప్పకుండా సీక్వెల్‌ చేయాలని నాకు ఉంది. అయితే అందుకు లారెన్స్‌ ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా కాంచన 3 చిత్రం విడుదల అయిన నేపథ్యంలో లారెన్స్‌ మీడియాతో మాట్లాడుతూ స్టైల్‌ 2 చేయాలని నాకు కూడా ఉంది. అయితే టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్స్‌ అయిన రామ్‌ చరణ్‌ మరియు అల్లు అర్జున్‌లతో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అల్లు అర్జున్‌ మరియు రామ్‌ చరణ్‌లు మంచి డాన్సర్స్‌. వీరితో పాటు ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ కూడా మంచి డాన్సర్‌. అందుకే ఈ ముగ్గురితో సినిమా చేస్తే ఎలా ఉంటుందంటూ మీడియా వారితో జోక్‌గా లారెన్స్‌ అనడం జరిగింది. ఎన్టీఆర్‌ సంగతి ఏమో కాని మెగా హీరోలు ఇద్దరు రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌లతో డాన్స్‌ బేస్డ్‌ ఒక సినిమా చేస్తే అది అదిరి పోవడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు.

ఇది ఒట్టి మాటలకే పరిమితం కాకుండా సాధ్యం అయితే బాగుంటుంది కదా అంటూ మెగా ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. మరి సాధ్యం అయ్యేనా చూడాలి.