హిందీలో దర్శకుడుగా పరిచయం కాబోతున్న సౌత్ స్టంట్ మాస్టర్

డాన్స్ కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు.అలాగే వివిధ విభాగాలలో పని చేసిన వారు కూడా దర్శకులుగా ప్రయత్నాలు చేసి వర్క్ అవుట్ అయ్యారు ప్రభుదేవా, లారెన్స్ డాన్స్ కొరియోగ్రాఫర్ గానే కెరియర్ కొనసాగించి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ స్టార్ దర్శకులుగా ఉన్నారు.

 Stunt Director Ravi Varma Tries As A Director In Hindi-TeluguStop.com

వీరి బాటలో కెవి గుహన్, సంతోష్ శ్రీనివాస్, శరత్ మండవ లాంటి కెమెరామెన్స్ దర్శకులుగా మెగా ఫోన్ పట్టి సక్సెస్ అయ్యారు.అలాగే స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా కెరియర్ స్టార్ట్ చేసి దర్శకులు అయిన వారు కూడా ఉన్నారు.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన థ్రిల్లర్ మంజు సాయి కుమార్ తో పోలీస్ స్టొరీ లాంటి పవర్ ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కించారు.ఈ మూవీ ఇప్పటికి కూడా ట్రెండ్ స్టార్ అని చెప్పాలి.

 Stunt Director Ravi Varma Tries As A Director In Hindi-హిందీలో దర్శకుడుగా పరిచయం కాబోతున్న సౌత్ స్టంట్ మాస్టర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతకు ముందు పోలీస్ కథతో ఎన్ని సినిమాలు వచ్చిన పోలీస్ స్టొరీ మూవీ మాత్రం ఎందుకనో ట్రెండ్ క్రియేట్ చేసింది.

Telugu Bollywood, Hindi, Sandalwood, Stunt Director Ravi Varma, Tollywood-Movie

తెలుగు, కన్నడ బాషలలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అలాగే అరుణ్ పాండ్యన్ అనే స్టంట్ కొరియోగ్రాఫర్ కూడా దర్శకుడుగా, హీరోగా సక్సెస్ అయ్యారు.ప్రస్తుతం తమిళంలో స్టార్ దర్శకుడుగా ఉన్న స్టంట్ శివ కూడా ఫైట్ మాస్టర్ గా సక్సెస్ అయ్యి మెగా ఫోన్ పట్టినవాడే.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టంట్ డైరెక్టర్ వచ్చి చేరబోతున్నాడు.కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకి స్టంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన రవివర్మ పూర్తి స్థాయిలో దర్శకుడుగా ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.

ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడుగా శివరాజ్ కుమార్ తో రుస్తుం అనే సినిమా తెరకెక్కించి హిట్ కొట్టాడు.ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

చివరిగా వకీల్ సాబ్ మూవీకి స్టంట్ కొరియోగ్రాఫర్ గా రవివర్మ పని చేశారు.

#Sandalwood #StuntDirector #Hindi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు