భారత్ లో తొలి గ్లాస్ స్కైవాక్.. ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిక్కిం రాష్ట్రంలో తొలి గ్లాస్ స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది.ఇది ఏకంగా సముద్ర మట్టానికి 7,200 అడుగుల ఎత్తులో నిర్మించారు.

 India's First Glass Skywalk In Sikkim, Sikkim, Pelling Town, Glass Skywalk, Indi-TeluguStop.com

సిక్కిం రాష్ట్రము లోని పెల్లింగ్ ‌లో గల 137 అడుగుల ఎత్తైన విగ్రహానికి కుడివైపున ఈ నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు.అక్కడ ఉన్న చెన్రెజిగ్ విగ్రహం దగ్గరికి వెళ్లేందుకు దాని పైకి వెళ్లే మెట్లు, అలాగే బంగారు ప్రార్థన చక్రాల యొక్క అద్భుతమైన దృశ్యాలను పర్యాటకులకు అందించే విధంగా ఈ స్కైవాక్ నిర్మించారు.

అద్భుతమైన హిమాలయాల మధ్య ఏర్పాటుచేసిన ఈ గ్లాస్ స్కైవాక్ చేయడానికి ఎంతో ఆహ్లాదకరంగా, అలాగే బౌద్ధమత పుణ్యక్షేత్రం యొక్క ఆకర్షణ మరింత శోభాయమానం చేసేలా ఈ స్కై వాక్ ను తీర్చిదిద్దారు.

ఇకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సిక్కిం సాంస్కృతిక శాఖ, అలాగే గృహ నిర్మాణ శాఖ భవనాలు పర్యవేక్షణలో ఈ నిధులను సమకూర్చడం జరిగింది.

ఈ స్కైవాక్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్మించడం జరిగింది.దీంతో ఆ ప్రాంతం ఖచ్చితంగా అతి త్వరలోనే బాగా ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Telugu Glass Skywalk, Heart, India, Indiasglass, Town, Sikkim, Skywalk-Latest Ne

ఈ స్కైవాక్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ స్కై వాక్ చేయడానికి బీపీ ఎక్కువగా ఉన్నవారు అలాగే హార్ట్ రేట్ తక్కువ ఉన్నవారు మాత్రం స్కై వాక్ చేయడం శ్రేయస్కరం కాదని నిపుణులు, నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేశారు.ఇకపోతే ఇలాంటి స్కై వాక్ లు చైనా, జపాన్ దేశాలలో మనకు ఎక్కువగా కనబడతాయి.అక్కడ కొన్ని వేల అడుగుల ఎత్తులో ఇలాంటి స్కై వాక్ లు ఎన్నో మనకు కనబడతాయి.

నిజానికి వాటిని చూస్తే వాటిపై నడవడానికి కూడా భయం వేసేలా అంత ఎత్తులో వాటిని నిర్మించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube