మోకాళ్లు దాటిన కుర్తీలు మాత్రమే వేసుకోవాలి అంటూ ఆంక్షలు,వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు  

Students Who Oppose Sanctions And Protest Against Only Kneeling Kurtis-kneeling Kurtis,social Media In Spread

ఇక నుంచి పొట్టి పొట్టి డ్రస్స్ లకు హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల స్వస్తి చెప్పనుంది.ఈ తరం యువతులు పొట్టి దుస్తులు ధరించడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే.

Students Who Oppose Sanctions And Protest Against Only Kneeling Kurtis-kneeling Kurtis,social Media In Spread-Students Who Oppose Sanctions And Protest Against Only Kneeling Kurtis-Kneeling Kurtis Social Media In Spread

ఈ నేపథ్యంలో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల మోకాళ్లు దాటిన కుర్తీలు మాత్రమే ధరించాలి అంటూ తాజాగా రూల్ ని పాస్ చేయడం తో ఇప్పుడు పెద్ద వివాదం రాజుకుంది.ఒకవేళ మోకాళ్ల కింద వరకు లేకుండా ఎవరైనా వస్త్రధారణ చేసుకుంటే మాత్రం వారిని నేరుగా వెనక్కి పంపించేస్తున్నారు.

Students Who Oppose Sanctions And Protest Against Only Kneeling Kurtis-kneeling Kurtis,social Media In Spread-Students Who Oppose Sanctions And Protest Against Only Kneeling Kurtis-Kneeling Kurtis Social Media In Spread

ప్రస్తుతం ఈ విషయానికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియా లో స్ప్రెడ్ అవ్వడం తో ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఆగస్టు 1 నుంచి స్లీవ్‌లెస్ కుర్తీలు, షార్ట్, జీన్స్ వంటివి కళాశాలలో నిషిద్ధమని కొత్త నిబంధన తీసుకువచ్చింది.విద్యార్థినుల వస్త్రధారణను తనిఖీ చేసిన తర్వాతే కళాశాల లోపలకు అనుమతించేందుకు వీలుగా ఒక మహిళా భద్రతా సిబ్బందిని కూడా గేటు వద్ద నిలబెట్టారు.

మోకాలు దాటిన కుర్తీలను వేసుకున్న విద్యార్థినులను మాత్రమే కళాశాల లోపలకు అనుమతిస్తున్నారు తప్ప డ్రెస్ కోడ్ ని పాటించని వారిని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు.అయితే కళాశాల యాజమాన్యం చేపట్టిన మోరల్ పోలిసింగ్‌ను వ్యతిరేకించాలని అటు బాలల హక్కుల సంఘంతో పాటు, విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.