ఆకలి అయి సమోసాలు కొనుక్కున్న స్టూడెంట్లు.. చచ్చిపడి ఉన్న చీమలు చూసి షాక్‌..

హోటల్ రెస్టారెంట్స్ ( Hotel restaurants )ఉద్యోగులు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఆహారాలను చాలా అశుభ్రంగా తయారు చేస్తున్నారు.ఫుడ్స్‌లో బొద్దింకలు కీటకాలు బల్లులు మాత్రలు వంటి హానికరమైనవి రావడం కామన్ అయిపోయింది.

 Students Who Were Hungry And Bought Samosas Were Shocked To See Dead Ants, Delhi-TeluguStop.com

తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలోని దయల్ సింగ్ ( Dayal Singh of Delhi University ) కాలేజీలో ఇలాంటి మరో సంఘటన వెలుగు చూసింది.ఇటీవల విద్యార్థులు తమకు ఇష్టమైన చిరుతిండి, సమోసాలు కొని తినడానికి క్యాంటీన్‌కు వెళ్ళారు.

కానీ వారు దానిని తినడం మాట అటు ఉంచితే వాంతు చేసుకునే పని అయ్యింది.ఎందుకంటే సమోసాల లోపల చనిపోయిన చీమలు ఉన్నాయి.

ఈ సమోసాలు విద్యార్థులకు వికారం కలిగించాయి.ఒక విద్యార్థి సమోసాను ( Samosa )కట్ చేసి చూడగా లోపల చీమలు కనిపించాయి.ఈ విషయం వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు అంకితమైన ఒక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు.ఈ వీడియోలో రెండు సమోసాలను కత్తిరించి చూపించారు, వాటిలో చీమలు కనిపించాయి.ఈ పోస్ట్ కేవలం ఒక వికారకరమైన విషయాన్ని చూపించడానికి మాత్రమే కాదు, క్యాంటీన్ ఆహారాన్ని తినకుండా ఉండాలని ఇతర విద్యార్థులకు హెచ్చరికగా కూడా ఉంది.

ఈ సంఘటన విద్యార్థులలో ఆందోళన కలిగించింది.క్యాంటీన్‌లో ( canteen )ఆహార పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.కళాశాల యాజమాన్యం ఈ విషయంపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.ఈ సంఘటనపై ఆన్‌లైన్‌లో రకరకాల రియాక్షన్లు వచ్చాయి.కొంతమంది విద్యార్థులు క్యాంటీన్‌లో ఇస్తున్న ఫుడ్ నాణ్యత గురించి నిజంగా ఆందోళన చెందారు.కానీ మరికొంతమంది మాత్రం ఈ ఘటనను సరదాగా తీసుకున్నారు.

సమోసాలలో చీమలు ఒక ఎక్స్‌ట్రా ఇంగ్రిడియంట్‌గా అందించారేమో అని సరదాగా కామెంట్ చేశారు.కాలేజీ క్యాంటిన్లు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం నాణ్యతగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని మరి కొంతమంది కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube