లోక‌ల్ ట్రైన్‌లో అన‌వ‌స‌ర స్టంట్ చేసిన స్టూడెంట్లు.. చివ‌ర‌కు

Students Who Did An Unnecessary Stunt On A Local Train To The End

అదేం స‌ర‌దానో తెలియ‌ట్లేదు గానీ ఈ మ‌ధ్య కొంద‌రు అన‌వ‌స‌ర వేశాల‌కు పోయి చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.స‌ర‌దాకు చేస్తున్నారా లేక ఫేమ‌స్ అయ్యేందుకు ఇలాంటి పోకిరి వేశాలు వేస్తున్నారో అర్థం కావ‌ట్లేదు.

 Students Who Did An Unnecessary Stunt On A Local Train To The End-TeluguStop.com

కానీ దాని ఫ‌లితం మాత్రం వారిని ఇబ్బందుల్లో ప‌డేస్తుంద‌నే చెప్పాలి.ఇప్పుడు కూడా కొంద‌రు స్టూడెంట్లు చేసిన ప‌ని వారిని ఇలాగే ప్రమాదాల బారిన ప‌డేలా చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.మ‌రి ఆ వీడియో ఏంటో, వారు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

 Students Who Did An Unnecessary Stunt On A Local Train To The End-లోక‌ల్ ట్రైన్‌లో అన‌వ‌స‌ర స్టంట్ చేసిన స్టూడెంట్లు.. చివ‌ర‌కు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రైల్వే స్టేష‌న్ల‌లో కొంద‌రు కావాల‌ని ప‌ట్టాల మీద నిల్చుని ట్రైన్‌కు ఎదురుగా ఫొటోలు దిగ‌డం లేదంటే వీడియోలు తీసుకోవ‌డం లాంటివి చూస్తున్నాం.అయితే ఇలాంటివి చేసి కొన్ని సార్లు ప్రాణాల మీద‌కు కూడా తెచ్చుకుంటున్నారు.

ఇక యూత్ అంటేనే ఇలాంటి పోకిరి వేశాలు వేయ‌డంలో చాలా ముందు వ‌రుస‌లో ఉంటుంది.ఇక ఇప్పుడు మ‌న ప‌క్క రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులోని చెన్నై ప‌ట్ట‌ణంలో కొంద‌రు విద్యార్థులు లోకల్ ట్రైన్ లో వెళ్తున్నారు.

అయితే ఇలా ట్రైన్ స్పీడుగా ఉన్న క్ర‌మంలోనే కొన్ని ప్రమాదకర విన్యాసాలు చేశారు.

కవరపెట్టై రైల్వే స్టేషన్ లో ట్రైన్ కాస్త స్పీడుమీద ఉన్న‌ప్పుడే విద్యార్థులు ట్రైన్ కింద‌కు ఒక కాలు పెట్టి వేలాడ‌టం, ఇంకొంద‌రు కింద‌కు దూకి మ‌ళ్లీ ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి ట్రైన్ ఎక్క‌డం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.అయితే ఇలా వెళ్తున్న వారిని గుర్తించిన పోలీసులు వెంట‌నే దింపేసి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.ఇక విద్యార్థుల స్టంట్ల‌కు సంబంధించిన వీడియో నెట్టింట ప్ర‌స్తుతం విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

దీన్ని చూసిన వారంతా కూడా ఇలాంటి పోకిరి వేశాలు అవ‌స‌ర‌మా.ప్రాణాల మీద‌కు వ‌స్తే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

#Danger Stunt #Chennai #Virla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube