పంతులమ్మ నీకిది కరెక్ట్ ఏ నా.? స్టూడెంట్స్ తో మసాజ్ లు ఏంటి.? షాకింగ్ వీడియో..!       2018-07-06   00:52:54  IST  Raghu V

స్కూల్ అంటే మనకు దేవాలయంతో సమానం. గురువు అంటే దేవుడితో సమానం. అలాంటి గొప్ప హోదాలో ఉన్న ఓ టీచర్ స్టూడెంట్స్ తో జడ వేయించుకోవడం ఎంత నీచమైన పని కదా. అది కూడా క్లాస్ లో హెడ్ మసాజ్ చేయించుకోవడం అంటే చెప్పుకోడానికే సిగ్గుచేటు. ఈ ఘటన జనగాం లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాలోని నర్మెట ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌‌లో ఫిజిక్స్ టీచర్‌ పార్వతి.. విద్యార్థినులతో జడ వేయించుకోవడం, బాడీ మసాజ్‌ చేయించుకోవడం చేస్తోంది. అది కూడా తరగతి గదిలోనే కావడం చర్చనీయంగా మారింది. సదరు టీచరమ్మ తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థినితో మసాజ్ చేయించుకుంటుండగా.. సహ విద్యార్థి ఒకరు ఆ దృశ్యాలను తన సెల్‌ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ ఘటన మీద డీఈఓ విచారణకు ఆదేశించారు.

‘మా మోడల్ స్కూల్లో ఎప్పుడూ ఇదే గతి. మాకు పాఠాలు చెప్పరు.. ఏం చెప్పరు. క్లాస్ రూమ్‌లోనే మసాజ్‌లు చేయించుకుంటారు. మాకు మంచి చదువులు చెప్పే టీచర్లు కావాలి’ అంటూ ఆ విద్యార్థి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లలకు అన్ని నేర్పించాల్సిన గురువులు ఇలా చేయడం న్యాయమేనా.? ఈ విషయంపై యాజమాన్యం స్పందించి ఉపాధ్యాయులురాలి నుంచి వివరణ కోరి ఉన్నతాధికారులు ఆమెపై చర్య తీసుకోనున్నారు.