ప్రధానోపాద్యాయురాలు ఇక రాదని తెలిసి గోడుగోడున ఏడ్చి కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులు... ఇంతకి ఆమె ప్రత్యేకత ఏంటో తెలుసా?

లక్డీకపూలోని ఓ మైనార్టీ పాఠశాలలో ప్రదానోపాద్యాయురాలు ఇక రాదని తెలిసి విద్యార్థులు సొమ్మసిల్లిపోయేలా ఏడ్చారు.నిన్నటి వరకు పాఠశాలలో పనిచేసి, తమ ఆలనాపాలనా చూసుకున్న ప్రధానోపాద్యుయురాలు ఇక రాదని తెలిసి విద్యార్థులు వెక్కి వెక్కి ఏడ్చారు.

 Students Cry For Head Master-TeluguStop.com

ప్రధానోపాద్యాయురాలు హుదా ఆజం మరియు వార్డెన్‌, డేటా ఎంట్రీ ఆఫీసర్‌లు సరిగా రికార్డులు మెయిన్‌టేన్‌ చేయడం లేదని ఉన్నతాధికాయి వారిని విధుల నుండి తొలగించారు.దాంతో బాధతో ప్రధానోపాద్యాయురాలు చివరగా విద్యార్థులను చూడడానికి వచ్చారు.

చివరగా మాట్లాడుతూ… కారణాలు లేకుండా తనను విధుల నుండి తొలగించారని, విద్యార్థులను తాను కన్న బిడ్డల్లా చూసుకున్నానని భావోద్వేగానికి లోనయింది.దాంతో విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనాన్ని సైతం మానేసి స్పృహ కోల్పేయేలా ఏడ్చారు.

మేడం ఇక రారాని గోడుగోడున కన్నీరు పెట్టుకున్నారు.విద్యార్థులను కంట్రోల్‌ చేయడానికి అక్కడి సిబ్బంది ఎంత ప్రయత్నించినా కూడా విద్యార్థులు పట్టించుకోకుండా ఏడ్చడంతో చేసేది లేక స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.

ఏడ్చి ఏడ్చి కళ్లు తిరిగిపోయిన పిల్లలకు ప్రమాదం ఏది లేదని డాక్టర్‌లు తెలిపారు.విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలియడంతో అక్కడ స్థానికులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చి తమ పిల్లలని చూడడానికి అనుమతివ్వాలని నినాదాలు చేశారు.అసలు పాఠశాలో ఏం జరుగుతుందో తమకు తెలియాలి అంటూ డిమాండ్‌ చేశారు.ఏది ఏమైనా తల్లిలా చూసుకునే ప్రధానోపాద్యాయురాలు ఇక రాదని తెలిసి ఆ విద్యార్థులు కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచివేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube