కావాలనే ఇరికించారు..అమెరికా పై ఇండో అమెరికన్ ఆరోపణ..!!!  

  • అమెరికా ప్రభుత్వం చేసిన పొరపాటు వల్లే భారతీయ విద్యార్ధులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని పైగా అమెరికా చేసిన తప్పుని భారతీయ విద్యార్ధులపై వేయడం తగదని ఉద్దేశపూర్వకంగానే విద్యార్ధులని తప్పుదోవ పట్టించారని ప్రముఖ ఇండో అమెరికన్ అటార్నీ అనూ పేషవారియా ఆరోపించారు.

  • Students About Fake University In AMerica-Nri Telugu Nri News Updates

    Students About Fake University In AMerica

  • ఓ ఫేక్ యూనివర్సిటీ సృష్టించేందుకు అనుమతించడం ద్వారా ఇదంతా జరిగిందని హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ఎక్కడో వేరే దేశంలో ఉన్నవారిని అమెరికాకు రప్పించి మరీ ఇరికించిందని ఆమె ఆరోపించారు. భారత విద్యార్థులు తెలిసే తప్పు చేశారంటూ ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం సరైనది కాదని ఆమె అన్నారు.

  • Students About Fake University In AMerica-Nri Telugu Nri News Updates
  • మా విద్యార్థుల తప్పు లేదని మేము చెప్పడం లేదు. వారు అన్ని విషయాలు ముందే తెలుసుకోవాల్సింది. కాని వారు కావాలని ఈ తప్పులు చేసి ఉంటే తప్పకుండా శిక్షించాలి కాని నేరం చేసేలా చేసి వారిని ఇరికిస్తే భారతీయ విద్యార్ధులకి తప్పకుండా సాయం చేయాల్సిందే అంటూ ఆమె తన మద్దతు తెలిపారు .

  • Attachments area