పోలీసు సైరెన్ ఆ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణం తీసింది.! అసలేమైందో తెలుస్తే షాక్.!       2018-06-07   23:23:43  IST  Raghu V

పోలీస్ అనే పేరు అనగానే…మనలో చాలా మంది భయపడిపోతుంటారు. రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఆపినప్పుడు అన్ని పేపర్స్ ఉన్నా ఫైన్ వేస్తారేమో అని భయపడుతుంటారు. వాస్తవానికి వాళ్లు మనకోసమే ఉన్నారని మరచిపోతుంటారు. పోలీసు వారు పెట్రోలింగ్ సైరెన్ కి ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి. అసలేమైంది అనుకుంటున్నారా.? . కరీంనగర్ జిల్లా రూరల్ మండలం మొగ్దుంపూర్ శివార్లలో జరిగిన ఘటన సంచలనం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.

మొగ్దుంపూర్ శివార్ల వైన్ షాపు ఉంది. షాపు పక్కన పొలాల్లో కూర్చుని ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పార్టీ చేసుకుంటున్నారు. వీరు నిగమా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. మొగ్దుంపూర్ లోని హాస్టల్ లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి శ్రావణ్ కుమార్ అనే స్టూడెంట్ పార్టీ చేసుకుంటున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ రూట్ లో వెళుతున్న పెట్రోలింగ్ వెహికల్.. సైరన్ మోగించింది. అంతే ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్, న్యూసెన్స్ కేసులు పెడతారనే భయంతో పొలాల్లో పరుగులు పెట్టారు విద్యార్థులు. అలా పరిగెడుతున్న సమయంలోనే.. శ్రావణ్ కుమార్ వ్యవసాయ బావిలో పడ్డాడు. ప్రాణాలు కోల్పోయాడు.

శ్రావణ్ స్వస్థలం మంచిర్యాల జిల్లా రామకృష్ణా పూర్. చేతికొచ్చిన కుమారుడు ఇలా చనిపోవటంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆరు నెలల్లో ఇలాంటి సంఘటనలు మూడు జరగటం చర్చనీయాంశం అయ్యింది. పైగా అన్ని ఘటనలు అవే మండలంలో..