ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ ని ఇప్పుడు చూస్తే అవాక్కవుతారు..!

కొంతమంది నటీనటులు చలన చిత్ర పరిశ్రమకు వచ్చీ రావడంతోనే స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ తో కలిసి నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఎందుకో 1, 2 చిత్రాల్లో నటించి సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నటువంటి నటీనటులు చాలా మందే ఉన్నారు.కాగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులని బాగానే అలరించిన టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ గజాల కూడా ఈ కోవకే చెందుతుంది.

 Student Number 1 Movie Fame Gajala Latest Stunning Photos Talk, Gajala, Telugu H-TeluguStop.com

కాగా నటి గజాల అప్పట్లో వచ్చీ రావడంతోనే ప్రముఖ స్టార్ హీరో జగపతి బాబు హీరోగా నటించిన “నాలో ఉన్న ప్రేమ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ చిత్రం మంచి హిట్ అవడంతో గజాలకి టాలీవుడ్ కోలీవుడ్ తదితర సినీ పరిశ్రమలో సినిమా ఆఫర్లు బాగానే తలుపు తట్టాయి.

దీంతో కొంతకాలం పాటూ సినిమా షూటింగులతో వరుస సినిమా ఆఫర్లతో గజాల బిజీబిజీగా గడిపింది.అయితే అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో గజాల ఉన్నట్టుండి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి గుడ్ బై చెప్పి వెళ్ళి పోయింది.

దీంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందని కానీ ఆ ప్రేమ పెటాకులు కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అప్పట్లో పలు కథనాలు వినిపించాయి.కానీ గజాల మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.

కాగా ప్రస్తుతం గజాల బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ సీరియల్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం నటి గజాల తన భర్తతో కలిసి దుబాయ్ లో సెటిల్ అయినట్లు సమాచారం.

Telugu Gajala, Number, Numbergajala, Telugu, Tollywood-Movie

అయితే నటి గజాల సినిమాలకు గుడ్ బై చెప్పినప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేస్తూ ఇప్పటికీ తన అభిమానులను బాగానే అలరిస్తోంది.అయితే తాజాగా నటి గజాల తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ వీడియోలో గజాల తన కను రెప్పలు ఎగరవేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో బాగానే అలరించింది.

దీంతో కొందరు నెటిజనులు ఈ వీడియోపై స్పందిస్తూ నటి గజాల కి 40 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ వన్నె తరగని అందంతో చాలా యంగ్ గా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube