ఒక కి.మీ. కు కేవలం 10 పైసల మైలేజ్ తో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన ఘనుడు..!  

Inter Second year Student Makes Electric Bike 10Paise mileage, Electric Bike, Viral Video, Petrol Diesel Rates, Six Months,Viral - Telugu Electric Bike, Inter Second Year Student Makes Electric Bike 10paise Mileage, Petrol Diesel Rates, Six Months, Viral, Viral Video

రోజు రోజుకి భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దీనితో ప్రజలు వాటి నుంచి తప్పించుకోడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

TeluguStop.com - Student Made Electric Bike10 Paise Mileage

ఇందులో భాగంగానే తాజాగా ఓ వ్యక్తి తానే స్వయంగా ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ ని తయారు చేసుకున్నాడు.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ కు చెందిన యష్ ఫార్మర్ ర్ ఓ మధ్య తరగతి అబ్బాయి.ప్రస్తుతం అబ్బాయి ఇంటర్ సెకండియర్ లో కామర్స్ చదువుతున్నాడు.

TeluguStop.com - ఒక కి.మీ. కు కేవలం 10 పైసల మైలేజ్ తో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన ఘనుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఆ కుర్రోడు సొంతంగా ఎలక్ట్రికల్ బైక్ తయారు చేసుకున్నాడు.ఇందులో ఫలితంగానే అతడు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మైలేజ్ పొందుతున్నాడు.

దాని వల్ల ఎటువంటి వాయుకాలుష్యం లేదు అలాగే ఆర్టీవో అధికారుల బెడద అసలే లేదు.

తన బైకు చూడటానికి ఎంతో అందంగా ఉండాలని తానే డిజైన్ కూడా చేసుకున్నాడు.17 సంవత్సరాలు ఉన్న ఈ అబ్బాయికి అసలు ఇలాంటి ఆర్టీవో రూల్స్ పాటించాల్సిన అవసరం లేని బైక్ ను తయారు చేయలేమా అనుకుంటూనే అతి తక్కువ ఖర్చులో ప్రయాణించగల ఎలక్ట్రికల్ స్కూటర్ ని అతి తక్కువ ఖర్చుతోనే పూర్తిచేశాడు.అయితే మొదటిగా తాను ఒక కారు తయారు చేయాలనుకున్నాడు కాకపోతే అది కష్టసాధ్యం అనిపించి దానికి బదులు ఒక ఎలక్ట్రికల్ బైక్ తయారు చేయడానికి సిద్ధమయ్యాడు.

ఇక అనుకున్నదే తరువాయిగా ఆ అబ్బాయి ఎలక్ట్రికల్ బైక్ సంబంధించిన పరికరాలను సంపాదించుకోవడం మొదలుపెట్టాడు.ఒక్కొక్కటిగా వాటిని జత పరుస్తూ మొత్తానికి ఓ బైక్ ను తయారు చేసాడు.

ఇక ఈ బైక్ కి స్పీడోమీటర్, బ్యాటరీ, లైట్స్, హారన్ ఇలా అన్నిటినీ ఫిట్ చేశాడు.

ఇకపోతే ఈ బైక్ గంటకు 35 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేస్తుంది.

అయితే ఇందుకు సంబంధించి ఒక కిలోమీటరు కేవలం పది పైసలు విలువచేసే పవర్ మాత్రమే అవసరమవుతుందని చెప్పుకొస్తున్నాడు.ఈ బైక్ తయారు చేయడానికి కేవలం తనకు 17000 మాత్రమే ఖర్చు జరిగినట్లు అతడు తెలిపాడు.

ఇక అందరికీ తెలిసిన ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకుల ధర ఏ రేంజ్ లో ఉన్నాయో.ఇక ఈ బైక్ పూర్తిగా చార్జింగ్ అవ్వడానికి మూడు గంటల సమయం పడుతుందని ఇతర ఎలక్ట్రికల్ బైక్ లతో పోలిస్తే ఈ బైక్ ధర చాలా తక్కువ అని చెబుతున్నాడు.

ఇక ఈ బైక్ ను తయారు చేయడానికి తనకి ఆరునెలల సమయం పట్టిందని తెలియజేశాడు.తాను పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

#Viral Video #PetrolDiesel #Viral #InterSecond #Six Months

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Student Made Electric Bike10 Paise Mileage Related Telugu News,Photos/Pics,Images..