పేదరికంలో ఉన్న గురువుని ఆదుకోవడానికి ఓ యువకుడు ఏం చేసాడంటే?

ప్రపంచంలో గురువును మించిన దైవం లేదంటారు పెద్దలు.అందుకే జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనకు విద్యాబుద్దులు నేర్పించిన గురువులను మర్చిపోకూడదనేది మనం జీవితంలో గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన అంశం.

 Student Starts Fund Raising To Help Teacher, Student, Tiktok Fund Raising, Ameri-TeluguStop.com

ఎందుకంటే మనం మన జీవితంలో ఏదో ఒకటి సాధించామంటే, ఏదో ఒక కొత్త విషయం మనం నేర్చుకోగలుగుతున్నామంటే అంతా మన గురువులు మనకు నేర్పించిన జ్ఞానం.అయితే అలా ఏదో ఒకటి నేర్చుకున్న మనం ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ సంతోషంగా ఉంటాం.

కాని ఆ గురువు పరిస్థితి ఎలా ఉందని ఆలోచించే వాళ్లు కొందరే ఉంటారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే అమెరికాలో నివసించే 77 ఏళ్ల స్కూల్ టీచర్ జోష్ రిటైర్డ్ అయి ఆర్థికంగా ఇబ్బo దులలో ఉన్నాడు.

అయితే ఆ నోటా ఈ నోటా టీచర్ జోష్ పరిస్థితి అతని శిష్యుడు దగ్గరకు చేరింది.అయితే ప్రస్తుతం ఆ టీచర్ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ ఇల్లు లేక ఓ కారులో నివసిస్తున్నాడు.

అయితే వెంటనే అతని పూర్వ విద్యార్థి నోవా తక్షణ సాయంగా 300 డాలర్లు సహాయం చేసాడు.అయితే ఇంకా సహాయం అవరమని గ్రహించిన నోవా టిక్ టాక్ లో ఫండ్ రైజింగ్ ఏర్పాటు చేసి 27 వేల డాలర్లు, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 19 లక్షలు గురువుకి అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube