లాక్ డౌన్ మళ్ళీ కావాలంటున్న విద్యార్థులు.. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ వింటే నవ్వుకుంటారు..

దేశంలో కరోనా వచ్చిన తర్వాత మనం కొత్త కొత్త పదాలను వింటున్నాం.కరోనా కారణంగా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 Student Give Hilarious Reaction On Lockdown Details, Coronavirus, Covid-19, Indi-TeluguStop.com

అప్పుడు సోషల్ మీడియాలో లాక్ డౌన్ గురించి చాలా ఫన్నీ వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు మరొకసారి ఓమిక్రాన్ విజృంభించిన వేళ మరోసారి లాక్ డౌన్ పెడతారు అంటూ వార్తలు వస్తున్న విషయం విదితమే.

కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో స్ట్రాంగ్ గా మన ముందుకు వచ్చింది.రోజురోజుకూ కేసులు మరింత పెరుగు తున్నాయి.ఈసారి ఓమిక్రాన్ రూపంలో భారీ ముప్పు తప్పదని అందరికి అర్ధం అయ్యింది.థర్డ్ వేవ్ కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతూ ఉండడంతో మరోసారి లాక్ డౌన్ ఉంటుంది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇప్పటికే కేసులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో పలు ఆంక్షలను విధించారు.అయినా కూడా కేసులు పెరుగుతుండడంతో ఈసారి కూడా లాక్ డౌన్ పెడతారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా కొంతమంది చిన్నారులు లాక్ డౌన్ గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.వీరు తమదైన శైలిలో లాక్ డౌన్ పై స్పందించిన ఫన్నీ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.ఈ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది విద్యార్థులు కూర్చుని ఉండగా ఒక రిపోర్టర్ వారిని లాక్ డౌన్ విధించాలా వద్దా.

అని ప్రశ్నించాడు.అప్పుడు వెంటనే ఆ విద్యార్థులు నేను లాక్ డౌన్ తప్పదని అనుకుంటున్నాను.

నేను చదువుని ఈజీగా కంప్లీట్ చేయాలనీ అనుకుంటున్నా.మాకు ఈజీగా పై క్లాసులకు ప్రొమోషన్ అవడం ముఖ్యం.

అందుకనే నేను లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్న.అని సరదాగా చెప్పాడు.

ఇంకో విద్యార్థి కూడా నాకు లాక్ డౌన్ కావాలి.ఎందుకంటే నాకు చదువు కోవడం.రాయడం ఇష్టం లేదని చెప్పాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube