వైరల్ వీడియో: ఆన్ ‌లైన్ క్లాసు జరుగుతున్న సమయంలో విద్యార్థి కిడ్నాప్.. కాకపోతే...?!

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కాలేజీ విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులు ఇంటి వద్ద నుండే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు.ఇందుకోసం వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ల్యాప్ టాప్స్, కంప్యూటర్ సామాగ్రి, స్మార్ట్ ఫోన్, నెట్ వర్క్ లను అందించడానికి ఎంతగానో ప్రయాస పడిపోతున్నారు.

 Student Fake Online Class Viral Video, Viral Video, Students, Teacher, Drama, Ki-TeluguStop.com

అయితే తల్లిదండ్రులు ఇంత కష్టపడుతుంటే కొంతమంది పిల్లలు మాత్రం పిచ్చి వేషాలు వేస్తున్నారు.అయితే ఇది వరకు ఆన్ ‌లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో ఓ అమ్మాయి ఇంట్లో ఒక్కతె ఉండడం గమనించిన దుండగులు ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేయడానికి పాల్గొన్న సంఘటన జరిగింది.

అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ గా మారింది కూడా.

అయితే ఇలాంటి వీడియో మరొకటి ఇప్పుడు చోటుచేసుకుంది.

కాకపోతే, దీని గురించి చదవడం కంటే వీడియోని చూస్తే పూర్తిగా అర్థమవుతుంది.ముందుగా ఆన్లైన్ లో ఉపాధ్యాయుడు, స్టూడెంట్స్ మధ్య క్లాస్ నడుస్తోంది.

అయితే ఓ విద్యార్థిని కొందరు గుర్తు తెలియని మనుషులు మాస్కు ధరించి కిడ్నాప్ చేశారు.అయితే ఇది చూసిన ‘ లెక్చరర్ అతనిని ఎవరైనా కిడ్నాప్ చేశారా.? తాను పోలీసులకు ఫోన్ చేయనా ‘ అని చెప్పేలోపే క్లాస్ లో ఉన్న ఓ అమ్మాయి పడి పడి నవ్వింది.దీంతో సదరు లెక్చరర్ కు కోపం వచ్చింది.

ఎందుకంటే అక్కడ జరిగిన కిడ్నాప్ కాదు… ఆ విద్యార్థి చేస్తున్న డ్రామా అని.

అయితే ఆ సంఘటన తర్వాత ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు ఇలాంటి వెకిలి చేష్టలు చేయకుండా, క్లాసులు వినడం ఇష్టం లేకపోతే ఇలాంటి వికృత చేష్టలు చేయొద్దని తెలిపాడు.పైగా ఈ వీడియోకి ఆన్‌లైన్ క్లాస్ కిడ్నాప్ అని పేరు కూడా పెట్టారండోయ్.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.దీనిని చూసిన కొందరు ఈ ఐడియా ఏదో బలే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం ఈ వీడియోని చూసి గుర్రుమంటున్నారు.

చదువుకోమని మీకు అన్ని సమకూరిస్తే ఇలాంటి పనులు చేస్తారా అంటూ విద్యార్థుల పై మండి పడుతున్నారు తల్లిదండ్రులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube