మొండిఘటం : జగన్ రాజకీయం ఇలాగే ఉంటుంది

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) రాజకీయం ఆషామాషీగా ఉండడం లేదు.గత రాజకీయకాలకు జగన్ రాజకీయాలకు పొంతనే ఉండడం లేదు.

 Stubborn  Jagans Politics Is Like This ,ysrcp, Ap Government, Jagan, Ap Cm Jagan-TeluguStop.com

యువ నాయకుడిగా ఉన్న జగన్ పార్టీలోనూ, ప్రభుత్వం లోనూ తనదైన శైలి మార్క్ కనిపించే విధంగా రాజకీయాలు చేస్తున్నారు.తాను అనుకున్న రూట్ లోనే ముందుకు వెళ్తున్నారు.

ఏ విషయంలోనూ అదరడం లేదు.బెదరడం లేదు.

ప్రస్తుత జగన్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతోంది.వైసీపీ ఏర్పడకముందు కాంగ్రెస్ ఎంపీ గా ఉన్న జగన్ తన తండ్రి రాజశేఖర రెడ్డి( Rajasekhara Reddy ) మరణం తరువాత ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అనుమతి ఇవ్వలేదు.అయినా జగన్ తన ఓదార్పు యాత్రను కొనసాగించారు.

ఇక అక్కడి నుంచి అనేక ఇబ్బందులు జగన్ కాంగ్రెస్ నుంచి ఎదుర్కొన్నారు.చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party )పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు.ఇక అక్కడి నుంచే పార్టీలో పూర్తిగా తన మార్క్ కనిపించే విధంగా జగన్ చేసుకోగలిగారు.2014 ఎన్నికల్లో వైసీపీ కి ఊహించని ఆదరణ లభించినా, జనసేన, బీజేపీ , టీడీపీ కూటమి కారణంగా అధికారానికి దూరం అయ్యాయి.కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటే అది పూర్తిగా జగన్ ఛరిష్మానే .

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Telugudesam, Ysrcp-Politics

ప్రస్తుతం వైసీపీ ఏపీ అధికార పార్టీగా ఉన్నా.ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కుంటోంది.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందు వెళ్తూ చాలా విషయాలల్లో పై చేయి సాధిస్తున్నారు.

అయినా జగన్ మాత్రం ఏ విషయంలోనూ అదరడం లేదు బెదరడం లేదు.జగన్ మొండి వైఖరి కారణం గా ఎంత నష్టం జరిగినా,ఎన్నిరకాల ఇబ్బందులు ఎదురయినా.మొండిగానే ఉంటున్నారు.పార్టీ గీత దాటి వ్యవహరించిన వారిపై ముందు వెనుక చూడకుండా సస్పెన్షన్ వేటు వేస్తున్నారు.

ఈ విషయంలో ముందు ముందు తమకు ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిసినా జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Telugudesam, Ysrcp-Politics

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఒక్క స్థానంలో ఓటమి చెందింది.అసలు ఓటమి అనే ప్రసక్తి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ల ఓట్లు కీలకం అవుతాయని ముందుగా తెలిసినా, జగన్ అవేమి పట్టించుకోలేదు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నియమ నాబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తేలడం తో వారిని వెంటనే దూరం పెట్టారు.అక్కడ నియోజకవర్గ ఇంచార్జీలను నియమించారు.

ఇక ఇప్పుడు వైసీపీ అభ్యర్థికి కాకుండా టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే అనుమానం తో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పవడానికి జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణం .తమ కు నష్టం జరుగుతుందని తెలిసినా, జగన్ మాత్రం ఈ వెన్నుపోటు రాజకీయాలను అస్సలు సహించరు.కానీ టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి పూర్తిగా భిన్నం.

చివరి నిమిషం వరకు ఆయన ఏమీ తేల్చరు.చివరి నిమిషం లో ఏదో ఒక హామీని ఇచ్చి బుజ్జగిస్తారు.

ఆ హామీని తరువాత పట్టించుకోరు.కానీ జగన్ ఉన్నది ఉన్నట్టు చెప్పేసి అక్కడితో విషయాన్ని తేల్చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube