సినిమా షూటింగ్‌లో అష్టకష్టాలు పడ్డాడు.. కట్ చేస్తే సూపర్ రిజల్ట్?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మొదటగా మంచి ఇమేజ్ ను తెచ్చిన సినిమా ఏది అంటే.అందరూ చెప్పే సమాధానం ఖైదీ.

 Struggles Behind Chiranjeevi To Become A Mega Star Chiranjeevi, Tollywood, Strug-TeluguStop.com

అప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఉండి 5 ఏళ్లు గడిచినా పెద్ద స్థాయిలో ఆడిన సినిమాలు మాత్రం అప్పటికి ఏమీ రాలేదు.అప్పట్లో ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.

ఇక ఈ సినిమాకి సంబంధించి చెప్పాలంటే ఈ చిత్రంలో ఒక చేజింగ్ సన్నివేశం ఒకటి ఉంటుంది. అరటి తోటలో చిరంజీవి పరిగెడుతుంటే అతని వెంట విలన్లు చేస్ చేస్తూ ఉంటారు.

అలా పరిగెడుతున్న సమయంలో చిరంజీవికి గాయం అయింది.అది ఎంతలా అంటే ఆ గాయం నుంచి కోలుకోవడానికి 20 రోజులు సమయం పట్టేలా.

సినిమా షూటింగ్ సైతం కొన్ని రోజులు ఆగిపోయింది.ఆ తర్వాత ఆ సినిమా నిర్మాత సొంత పర్యవేక్షణలో చిరంజీవికి వైద్యం అందించారు.

అలా 20 రోజుల తర్వాత చిరంజీవి కోలుకొని తిరిగి షూటింగ్ కి సిద్దం అయ్యారు.

Telugu Chiranjeevi, Khidi, Struggules, Tollywood-Movie

ఇక మరోసారి ఆ సినిమా షూటింగ్ లోనే తలకోనకు వెళ్ళారు.అది తిరుపతికి దగ్గర్లో ఉంటుంది.తలకోన అంతా అడవి ప్రాంతం.

కాబట్టి అక్కడ షూటింగ్ చేయాల్సి వస్తే హీరోలకు తిరుపతిలో రూం బుక్ చేసే వారు.కానీ చిరంజీవి మాత్రం తాను వారందరికీ ఖర్చు, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తాను కూడా వారితో పాటే తలకోనలో ఉంటానని అన్నారట.

దీంతో డైరెక్టర్ కోదండరామిరెడ్డి, నిర్మాత తిరుపతి తిరుపతి రెడ్డి ఒకే దగ్గర చాపమీదనే పడకునే వారట.ఇక రోజంతా షూటింగ్ లో భాగంగా చేజింగ్ లు, ఫైటింగ్ లు చేసి అలసిపోయినా కూడా చిరంజీవి మాత్రం అలా చాప మీదే పడుకునే వారట.

అలా ఆయన ఆ చిత్రానికి చాలా కష్టపడ్డారు.

Telugu Chiranjeevi, Khidi, Struggules, Tollywood-Movie

అందుకే చిరంజీవి ఎప్పటికీ నిర్మాతల హీరోగా, దర్శకులకు ఫ్రెండ్లీ హీరోగా నిలిచిపోతారు.చాలా మంది డైరెక్టర్స్ కూడా అందుకే ఆయనతో సినిమాతో తీసేందుకు ఆసక్తి కనబరుస్తారట.ఖైదీ సినిమా కోసం అంతా కష్టపడ్డారు కాబట్టే రిజల్ట్ కూడా అదే స్థాయిలో వచ్చిందనే చెప్పుకోవాలి.

ఇప్పటికి కూడా ఆ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే.అప్పుడు ఆ సినిమా కోసం ఆ చిత్ర టీం పడ్డ కృషే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube