బ్రేకింగ్ న్యూస్ ..బీజేపి సీఎం అభ్యర్ధిగా జగన్       2018-06-15   03:29:40  IST  Bhanu C

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వార్తలు వింటామో ఎవరికీ తెలియదు..ఒక్క సారిగా రాజకీయ పరిస్థితులు తల్లకిందులు అవుతూ ఉంటాయి పార్టీలకి పార్టీలు తుడిచి పెట్టుకు పోతూ ఉంటాయి..అయితే ఎప్పటి నుంచో దక్షిణాదిలో పాగా వేద్దామని సరైన సమయం కోసం వేచి చూస్తున్న బీజేపి ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది..బీజేపి వైసీపి పొత్తు ఉంటుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు మరొక సంచలన వార్త గుప్పుమంది..ఒక్క సారిగా అందరూ ఈ వార్తతో షాక్ కి గురయ్యారు.

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపిని బీజేపి లో విలీనం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది..జాతీయ మీడియా ఛానల్ ప్రసారం చేసిన కథనాల ప్రకారం బిజెపి తో వైకాపా పొత్తు లాంఛనమే అని తెలుస్తుంది..బీజేపి వర్గాలలో కూడా ఈ చర్చ జోరుగా సాగుతోంది.. అంతేకాదు ఈ విలీన బేరానికి మధ్యవర్తిత్వం నడిపింది కూడా ఎవరో కాదు గాలి బ్రదర్ అని కూడా సంచారం ఉందట…ఆపరేషన్ గరుడలో భాగం గా చంద్రబాబు వ్యతిరేక శక్తులు అన్నిటిని ఒక ప్లాట్ ఫారం మీదకి తీసుకుని వచ్చి పోరాడాలని నిశ్చయించినట్టు తెలుస్తుంది.

జాతీయ మీడియా కధనం ప్రకారం బిజెపితో విలీనం పూర్తవ్వగానే ఏపీ కి వారాల జల్లులు ప్రకటించి బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధీ గా జగన్ మోహన్ రెడ్డిని ప్రకటిస్తారట…ఈరోజు జరిగే మీటింగ్ లో ఇదే విషయాన్ని కీలకంగా చర్చించనున్నారని టాక్ వినిపిస్తోంది..ఈ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే, జగన్ సన్నిహితుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు, మారుతున్న పరిస్థితులు, ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ టీడీపీ చేస్తున్న పోరాటం, టిడిపి ని ఉమ్మడిగా ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై వీరు చర్చించినట్లు చెబుతున్నారు.

ఇదిలాఉంటే ఈ మొత్తం సమావేశానికి రాంమాధవ్‌ మధ్యవర్తిత్వం చేస్తున్నారట..అంతేకాదు ఈ భేటీ వివరాలు ఎప్పటికప్పుడు షా కి తెలియచేస్తారట..రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కోసం లోపలికి వెళుతున్న దృశ్యాలు రాష్ట్ర మీడియాలో కూడా రావటం విలీన కథనాలకు బలం ఇస్తుంది. పీఏసీ చైర్మన్‌గా ఉన్న బుగ్గన ప్రభుత్వ ఖర్చులు, కేటాయింపులపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారీస్థాయిలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.యా.. ఈక్రమలోనే చంద్రబాబు పై చర్యలు తీసుకునేలా వ్యూహాలు చేస్తూ జగన్ పై అంచనాలని పెంచి ఆతరువాత బీజేపి లోకి విలీనం చేసి జగన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారని తెలుస్తోంది..అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనేది పక్కన పెడితే ఇదే గనుకా జరిగితే జగన్ అడ్రెస్స్ లేకుండా పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.