కరోనా టైం లో బిర్యానీ ఆర్డర్ చేస్తే,తీరా….  

Strink Biryani Hyderabad Zomato - Telugu Biryani Zone, Corona Time, Hyderabad, Restaurant, Strink Biryani, Zomato

కరోనా టైం లో అసలు బయట ఆహారమే తినకూడదు అని నిపుణులు,డాక్టర్లు చెబుతున్న విషయం తెలిసిందే.అయితే ఇలాంటి సమయంలో కూడా ఫుడ్ డెలివరీ లు అందుబాటులోకి వచ్చేటప్పటికీ బిర్యానీ ఆర్డర్ పెట్టగా క్షణాల్లో ఇంటికి బిర్యానీ వచ్చేసింది.

 Strink Biryani Hyderabad Zomato

కానీ తీరా బిర్యానీ తిందాం అని ప్యాక్ ని తెరచి చూడగా అది పాచిపోయి ఉంది.అసలుకే కరోనా మహమ్మారి తో పోషకాహారం తినండి, రోగ నిరోధక శక్తి పెంచుకోండి అని ప్రధాని గారు చెబుతుంటే ఇలాంటి పాచిపోయిన బిర్యానీ ని తింటే ఇంకేమైనా ఉందా.

అసలు ఇంతకీ ఈ బిర్యానీ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా, హైదరాబాద్ కుషాయి గూడ లోని బిర్యానీ జోన్ రెస్టారెంట్ నుంచి.జొమాటో యాప్ ద్వారా బిర్యానీ జోన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టగా తీరా ఇంటికి వచ్చిన పార్సిల్ ను తెరచి చూడగా అది పాచిపోయింది.

కరోనా టైం లో బిర్యానీ ఆర్డర్ చేస్తే,తీరా….-General-Telugu-Telugu Tollywood Photo Image

లాక్ డౌన్ సడలింపులతో హైదరాబాద్ లోని ఒక్కో రెస్టారెంట్ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటూ ఉండగా హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన కస్టమర్ కి బిర్యానీపై మోజుపడింది.దీంతో జోమాటో ద్వారా చికెన్ బిర్యానీకి అర్డర్ ఇచ్చాడు.

దీనితో కుషాయిగూడకు చెందిన బిర్యానీ జోన్ రెస్టారెంట్ నుంచి డెలివరీ బాయ్ తీసుకొచ్చిన.బిర్యానీ పార్శిల్ విప్పిన కస్టమర్ కి అందులో దుర్వాసన రావడంతో రెస్టారెంట్ కు ఫోన్ చేయగా తాము అందరికి ఒకే విధంగా సరఫరా చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితుడు చెబుతున్నాడు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.పాచిపోయిన బిర్యానీ సఫ్లై చేస్తున్న రెస్టారెంట్లపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నాడు.ఒకపక్క కరోనా తో అల్లాడుతున్న రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు కూడా చోటుచేసుకోవడం మరింత తలనొప్పిని తెచ్చిపెడుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Strink Biryani Hyderabad Zomato Related Telugu News,Photos/Pics,Images..

footer-test