ఆలయ భూముల ఆక్రమణదారులకు కఠిన చర్యలు -మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  

telangana, temple lands, ministers indrakaran reddy, thalasani srinivas yadav, hyderabad, - Telugu Hyderabad, Ministers Indrakaran Reddy, Telangana, Temple Lands, Thalasani Srinivas Yadav

దేవాలయ భూముల ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం జంట నగరాల పరిధిలోని దేవాదాయ భూముల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దేవాదాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

 Strict Measures Against Invaders Of Temple Lands

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ, విజిలెన్స్ జాయింట్ సెక్రటరీ శేఖర్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిరూపయోంగా ఉన్న ఆలయ భూములను గుర్తించి, వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఆలయ భూముల ఆక్రమణదారులకు కఠిన చర్యలు -మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి-Devotional-Telugu Tollywood Photo Image

దేవాదాయ శాఖకు సంబంధించి ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు.నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖ షాపులను లీజుకు తీసుకుని.తిరిగి వాటిని అధిక ధరకు లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.దశాబ్దాల క్రితం నాటి లీజులతో పాటు అద్దె విషయంలో పున:సమీక్షించాలని చెప్పారు.దీర్ఘ కాలంగా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఆలయ భూముల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

హైదరాబాద్ పరిధిలో 13 ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న దేవాదాయ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‎లు, కళ్యాణ మండపాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిచామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మంత్రులకు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ద్వారా 1,300 ఎకరాల ఆలయ భూములను గుర్తించి వెనక్కి తీసుకున్నామని తెలిపారు.మరో 21 వేల ఎకరాల ఆలయ భూములకు రక్షణ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.

#Hyderabad #Telangana #Temple Lands

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

strict measures against invaders of temple lands Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL