‘మా‌’ ఎన్నికలు.. నలుగురు సెలబ్రిటీల బలాబలాలివే..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనుండగా అధ్యక్ష పదవి కోసం పోటీ చేయనున్నట్టు మొదట ప్రకాష్ రాజ్ ప్రకటించారు.ఆ తరువాత ఆ పదవి కోసం పోటీ పడుతున్నట్టు జీవితా రాజశేఖర్, మంచు విష్ణు, హేమ ప్రకటన చేశారు.

 Strenghts Of Movie Artist Assosiation President  Candidates , Jeevitha Rajasekha-TeluguStop.com

భవిష్యత్తులో మరి కొందరు సెలబ్రిటీలు పోటీ చేస్తున్నట్టు ప్రకటన చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వినిపిస్తోంది.

అయితే పోటీ చేస్తున్న సెలబ్రిటీలలో ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి.

ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే అనుభవం ఉన్న సీనియర్ నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మద్దతు ప్రకటించగా ప్రకాష్ రాజ్ కు ఒక పార్టీ మద్దతు కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చిరంజీవి ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కొత్త భవనం ప్రకాష్ రాజ్ కు ప్రధాన ప్రచారాంశంగా ఉంది.

Telugu Maa, Artist, Prakash Raj, Senior Naresh-Movie

మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇప్పటికే అనేక సినిమాలలో హీరోగా నటించారు.నటుడు సీనియర్ నరేష్ మద్దతు విష్ణుకు ఉందని తెలుస్తోంది.మోహన్ బాబు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల మద్దతు కోరినట్లు ప్రచారం జరుగుతోంది.ఇండస్ట్రీలో అందరినీ కలుపుకొనిపోవడమే మంచు విష్ణు ప్రధాన ప్రచారాంశం అని తెలుస్తోంది. జీవితా రాజశేఖర్ ప్రస్తుతం మా సెక్రటరీగా పని చేస్తున్నారు.

Telugu Maa, Artist, Prakash Raj, Senior Naresh-Movie

గతంలో కొంతమంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు జీవితా రాజశేఖర్ సాయం చేయగా వారి మద్దతు ఈమెకు ఉంటుందని తెలుస్తోంది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను బలోపేతం చేసేందుకు అవసరమైన అనుభవం ఉండటం జీవితకు ప్లస్ కానుంది.సినీ నటి హేమ ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యురాలిగా ఉన్నారు.

గతంలో తనకు ఓటు వేసిన వాళ్లు ఇప్పుడు కూడా ఓటు వేస్తారని ఆమె భావిస్తున్నారు.ఏ సమయంలో పోటీ చేసినా అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube