సూపర్: ఆస్ట్రేలియన్ వీధులకు మన క్రికెటర్స్ పేర్లు

క్రికెట్ అనగానే పెద్ద నుంచి చిన్న వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు.అందుకే క్రికెటర్స్ కు దేశంతో సంబంధం లేకుండా అభిమానులు పుట్టుకొస్తూ ఉంటారు.

 Streets In Melbourne Named After Indian Cricketers ,melbourne,indian Cricketers,-TeluguStop.com

అయితే ఆస్ట్రేలియా లో కూడా భారత క్రికెటర్ల పై ఉన్న అభిమానం తో కొన్ని వీధులకు వారి పేర్లనే పెట్టుకున్నట్లు తెలుస్తుంది.ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ దిగ్గజాలు అయిన కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేర్లను తమ వీధులకు పెట్టుకోవడం అంటే కొంచెం ఆశ్ఛర్యం కలిగించే విషయమే.

మెల్‌బోర్న్‌లో రాక్‌బ్యాంక్‌ ప్రాంతంలోని ఓ ఎస్టేట్‌లోని వీధులకు ‘టెండూల్కర్ డ్రైవ్‌’, ‘కోహ్లీ క్రెసెంట్‌’, ‘దేవ్‌ టెర్రెస్‌’ అని పేరుపెట్టుకున్నారు.
ఈ రాక్‌బ్యాంక్‌ ప్రాంతం మెల్టన్‌ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది.

ఈ ప్రాంతంలో మన భారతదేశానికి చెందిన వారు ఇళ్లని ఎక్కువగా కొనుగోళ్లు చేస్తుంటారు.అందువల్ల వారిని ఆకర్షించడానికి భారత క్రికెటర్ల పేర్లు పెట్టారట.

అంతే కాకుండా మిగితా వారిని కూడా ఆకర్షించడానికి అంతర్జాతీయ ఆటగాళ్ల పేర్లు కూడా ఎస్టేట్‌లోని వీధులకి పెట్టారు.వా స్ట్రీట్‌, మియాందాద్‌ స్ట్రీట్‌, అంబ్రోస్‌ స్ట్రీట్‌, సొబెర్స్ డ్రైవ్‌, కలిస్‌ వే, హాడ్లీ స్ట్రీట్‌, అక్రమ్‌ వే అని పెట్టారు.

ఇలా క్రికెటర్ల పేర్లు పెట్టడంతో భారతీయుల నుంచి భారీ స్పందన వస్తుందని, అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్టేట్‌ నిర్వహణాధికారులు చెబుతున్నారు.ఎస్టేట్‌ నిర్వాహణాధికారుల ప్రతిపాదించిన వీధి పేర్లను సిటీ కౌన్సిల్‌ ఆమోదిస్తుంది.

అయితే ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్‌, కుమార సంగక్కర పేర్లను ప్రతిపాదించగా కొన్ని కారణాలతో వాటికి అనుమతి లభించలేదని వారు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube