Gulab Jamun Noodles : ఇదెక్కడి విచిత్రమైన ఫుడ్ కాంబో.. నూడుల్స్‌లో గులాబ్ జామున్‌..!

ఆహార ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే… నూడుల్స్ తో గులాబ్ జామూన్!( Gulab Jamun Noodles ) ఈ వింత కలయిక గురించి మీరు కలలోనైనా ఊహించలేదు కదూ.

 Street Vendor Goes Viral For Making Gulab Jamun Noodles-TeluguStop.com

కానీ వీధి వ్యాపారాలు మన ఊహలకందని కాంబోలు తయారుచేస్తూ నూరేళ్లపెట్టేలా చేస్తున్నారు.రుచికరమైన నూడుల్స్ తో తియ్యటి గులాబ్ జామూన్ తింటుంటే వచ్చే అనుభూతిని తిన్నవారు తప్ప వేరే వారు ఊహించుకోలేరు.

ఒక స్ట్రీట్ ఫుడ్ విక్రేత( Street Food ) ఈ వింత కలయికను ప్రయత్నించాడు.అతను మొదట కూరగాయల నూడుల్స్ ను వండాడు.ఆపై ఏం చేశాడో తెలుసా? గులాబ్ జామూన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి నూడుల్స్ లో కలిపాడు.

వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.అతడి వెరైటీ కాంబో ఫుడ్( Food Combo ) కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.చాలా మంది ఈ ఫుడ్ కాంబోను చూసి ఆశ్చర్యపోతున్నారు.

కొంతమంది ” ఇదిరుచిగా ఉండొచ్చు” అని అంటున్నారు.మరికొందరు “ఊహించలేనంత వింతగా ఉంది” అంటున్నారు.

ఈ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలా మంది దీనిపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ఈ ఫుడ్ కాంబో చూసి ఆశ్చర్యపోయి, “నూడుల్స్ రుచి పాడైపోయింది” అని అంటున్నారు.మరికొందరు ఈ వంటకంపై వ్యంగ్యంగా జోకులు వేస్తున్నారు.

అయితే కొందరు వీధి ఆహార సంప్రదాయాలను గౌరవించాలని కూడా అంటున్నారు.ఇది ఒక్క వింత వంటకం మాత్రం కాదు.“గులాబ్ జామూన్ చాట్” అనే మరో వంటకం కూడా వైరల్ అవుతోంది.దీనిలో పెరుగు, చింతపండు సాస్, దానిమ్మ గింజలు, నూడుల్స్, పాపడ్ ముక్కలు కలిపి స్వీట్ డెజర్ట్ తయారు చేస్తారు.

ఇంకా మున్ముందు ఎలాంటి ఫుడ్ కాంబినేషన్స్( Food Combinations ) చూడాల్సి వస్తుందో చూడాలిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube