నవంబర్ 19 న విడుదలవుతున్న స్ట్రీట్ లైట్ మూవీ...

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రంస్ట్రీట్ లైట్ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు లో నవంబర్ 19న థియేటర్స్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

 Street Light Movie To Be Released On November 19, Kavya Reddy , Vinod Kumar , V-TeluguStop.com

చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.

ఈ స్ట్రీట్ లైట్ సినిమాని సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 19న థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నాము.సినిమా చాలా బాగా వచ్చింది.

మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము.

ఈ సినిమా ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెర కెక్కించారు.అందరూ ఈ సినిమా బూతు సినిమా అనుకుంటున్నారు.

కానీ ఈ సినిమా లో ఆన్ని రకాల షేడ్స్ కలిగిన ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది.ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని అన్నారు.

Telugu Ankith Raj, Kavya Reddy, November, Street, Tanya Desai, Vinod Kumar, Vish

చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ స్ట్రీట్ లైట్ మూవీ ని మూవీ మాక్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ గారు నిర్మించారు.ఈ స్ట్రీట్ లైట్ సినిమాని నవంబర్ 19 న థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో వినోదాత్మకంగా చూపిస్తూ, పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్ తో ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనేరివెంజ్ డ్రామాకథాంశంతో స్ట్రీట్ లైట్ చిత్రం రూపొందించడం జరిగింది.మంచి మేకింగ్ వాల్యూస్ తో వైవిధ్యభరితమైన సినిమాను రూపొందించి నందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

నటీనటులు :

తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr.పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు నటించారు.

సాంకేతిక నిపుణులు దర్శకత్వం : విశ్వ నిర్మాత: మామిడాల శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ : రవి సి కుమార్, మ్యూజిక్ : విరించి, ఎడిటర్ : శివ వై ప్రసాద్, ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్, ఫైట్స్ : నిఖిల్, కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్, స్టూడియో : యుఅండ్ఐ.పిఆర్ ఓ : మధు వి.ఆర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube