కుక్కల మరణం,కలవర పడుతున్న గ్రామస్తులు

ఒకపక్క కరోనా మహమ్మారి తో ఎప్పుడు ఎవరు మృతి చెందుతారో అన్న విషయం అర్ధంకాక జనాలు టెన్షన్ పడుతుంటే, తెలంగాణా పెద్ద పల్లి జిల్లా లో ఒడెడ్ గ్రామంలో వరుసగా కుక్కల మరణాలు చోటుచేసుకోవడం ఆ గ్రామస్తులను మరింత కలవరపెడుతుంది.ఇటీవల అమెరికా లోని ఒక జూ లో పులికి కరోనా సోకినట్లు అక్కడి అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.

 Karimnagar, Peddapalli, Dogs Death, Corona Effect, Hypo Chloride-TeluguStop.com

అయితే ఒడెడ్ గ్రామంలో కూడా వరుసగా కుక్కలు మరణిస్తూ ఉండడం తో వాటికి కూడా ఏదైనా వింతైన రోగం వచ్చిందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.దీనితో అధికారులకు ఫిర్యాదు చేయగా వెంటనే పశువైద్యాధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
గ్రామంలో మూడు రోజుల క్రితం కరోనా వైరస్ ప్రబలకుండా ఉండడానికి శానిటైజర్లు చల్లారు.హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతో అది పడిన ఆహారం, నీరు తాగడం వల్ల ఇలా జరిగి ఉంటుందని వైద్యాధికారులు భావిస్తున్నారు.

ఒకవేళ పిచికారీ చేసిన తర్వాతే శునకాలు మరణిస్తున్నట్లు అయితే ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.ఆ గ్రామంలో ఉన్నట్టుండి మోత్తం 12 శునకాలు మరణించడం జరగడం తో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Telugu Corona Effect, Dogs, Hypo, Karimnagar, Peddapalli-Latest News - Telugu

అయితే హైపోక్లోరైడ్ ద్రావణం వల్ల అవి మృతి చెందొచ్చు అని చెప్పిన అధికారులు మరోపక్క లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం తో వాటికి ఆహరం దొరక్క కూడా మరణించే అవకాశం ఉందని అంటున్నారు.కారణం ఏదైనా అక్కడ వరుసగా కుక్కలు మరణిస్తుండడం తో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఇటీవల పక్షలకు, జంతువులకు ఏవో తెలియని వింత రోగాలు రావడంతో ఫౌల్ట్రీ రంగం దివాలా తీసిన సంగతి తెలిసిందే.వేలాది కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ యజమానులకు తీవ్ర నష్టం ఏర్పడింది.

కరోనా వైరస్ తొలినాళ్ల లో చికెన్ తినకూడదు అంటూ తెగ ప్రచారం జరగడం తో చాలా మంది పౌల్ట్రీ వ్యాపారస్తులకు భారీగా నష్టం వాటిల్లింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube