ఇతడు బిచ్చగాడే కానీ… లక్షాధికారి కూడా…  

Street Beggar Kurnool Viral News - Telugu Kurnool, Money, Street Beggar, Viral News

తేనె టీగ సంవత్సరం పొడవునా కష్టపడి తాను తినకుండా తేనె కూడపెట్టినప్పటికీ చివరికి అది బాటసారి పాలవడం లేదా వేటగాడు తన్నుకు పోవడమనే కథలు మనం చాలానే వింటుంటాం … సరిగ్గా అలాగే వృద్ధుడు కష్టపడి బిచ్చమెత్తుకుంటూ సంపాదించిన సొమ్మును అనుభవించకుండా దాచుకుంటూ చివరికి మృతి చెందడంతో ఆ సొమ్ము ఇతరులు పాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది.

 Street Beggar Kurnool Viral News

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని డోన్ పట్టణ పరిసర ప్రాంతంలో శ్రీను అనే ఓ యాచకుడు గత కొద్ది కాలంగా బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తున్నాడు.

కాగా తాజాగా ఇటీవలె ఈ యాచకుడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు.దీంతో స్థానికులు యాచకుడు మరణించిన విషయాన్ని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

ఇతడు బిచ్చగాడే కానీ… లక్షాధికారి కూడా…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో సంఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అతడి వస్త్రాలలో దాదాపుగా 2 లక్షల రూపాయలకు పైగా నగదు ఉన్నట్లు గుర్తించారు.అలాగే వృద్ధ యాచకుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ విషయం సోషియల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీంతో పలువురు నెటిజన్లు కష్ట పడిన సొమ్మును తాను తినకుండా ఇతరుల పాలు చేయడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొంతమంది మాత్రం ఇలా జీవితాంతం కష్టపడి బిచ్చ మెత్తుకుంటూ సంపాదించిన సొమ్మును కష్ట పడినవారు ఎలాగో అనుభవించలేదు కాబట్టి కనీసం వారి పేరుతో పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేస్తే కనీసం వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే అంటారు మనిషి బ్రతికి ఉన్నప్పుడు కడుపు కట్టుకొని తినీతినక ఎంత కూడపెట్టినప్పటికీ చివరికి తన వెంట ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లలేడని…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Street Beggar Kurnool Viral News Related Telugu News,Photos/Pics,Images..

footer-test