కర్నూలు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు..!!

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల కర్నూలు జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.దీంతో జిల్లాలో పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి.

 Streams Overflowing In Kurnool District Kurnool, Floods, Ragha Vedra Circle , An-TeluguStop.com

తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహించడంతో హెచ్.పీ గ్యాస్ లారీ వాగులో చిక్కుకుపోయింది.

ఈ క్రమంలో లారీ డ్రైవర్ నీ తాళ్లతో రక్షించారు స్థానికులు.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

జిల్లాలో రోడ్లు చెరువుల మారిపోయాయిలోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.దీంతో చాలావరకు వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎటు వెళ్ళాలో తెలియక భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.వర్షాలకు మంత్రాలయం కూడా పూర్తిగా నీట మునిగింది.

రాఘవేంద్ర సర్కిల్ జలమయమైంది.జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు.

దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube