వ్యూహ ప్రతి వ్యూహాలలో నిమగ్నమైన ప్రతిపక్షాలు...ఇక సమరమేనా?

తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం హీటెక్కిన పరిస్థితి ఉంది.త్వరలో మరో ఉప ఎన్నిక సమరానికి తెలంగాణ వేదిక కాబోతున్న విషయం తెలిసిందే.

 Strategies Oppositions Engaged In Every Tactic ... Is It A Struggle Anymor Trs P-TeluguStop.com

అదే హుజూరాబాద్ ఉప ఎన్నిక.అయితే ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకపోవడంతో ఇటు బీజేపీ, టీఆర్ఎస్ కొద్దిగా ప్రచారాన్ని తగ్గించిన పరిస్థితి ఉంది.

అయితే నేడు హుజూరాబాద్ తో పాటు బద్వేల్ కి కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేసింది.అయితే ఇప్పటి నుంచి అసలు సిసలైన సమరం మొదలు కానుంది.

టీఆర్ఎస్ కు కంచుకోట అయిన హుజూరాబాద్ లో గెలిచి పట్టు నిలుపుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఆత్మ గౌరవం నినాదంతో బరిలోకి దిగిన ఈటెల మళ్ళీ తన స్థానంలో గెలుపొంది టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని తన శక్తికి మించి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇక అధికారికంగా షెడ్యూల్ విడుదల కావడంతో అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం విజయం సాధించడం కోసం వ్యూహ, ప్రతి వ్యూహాలలో నిమగ్నమైన  పరిస్థితి ఉంది.

అయితే బీజేపీ దుబ్బాకలో గెలిచి ఎలా రాష్ట్ర వ్యాప్తంగా బలపడడానికి ఆ విజయం దోహదపడిందో, అలాగే హుజూరాబాద్ విజయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయంగా మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Telugu @bjp4telangana, @trspartyonline, Bandi Sanjay, Bjp, Etala Rajendher, Huzu

అయితే ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.అందుకే ఏకంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావును బరిలోకి దింపి హుజూరాబాద్ లో గెలుపు దిశగా వెళ్లేందుకు వ్యూహాలను పన్నుతోంది.అయితే ప్రతిపక్షాలు  మాత్రం టీఆర్ఎస్ ను ఎట్లాగైనా సరే ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రజల మద్దతు కోల్పోతున్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం మాత్రం మెండుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube