కారులో వింత శబ్దాలు... ఏంటా అని చూస్తే ఊహించని షాక్..!

వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ అంతా కలిసి ఏదో ఒక అందమైన, ప్రశాంతమైన ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా.సరిగ్గా అలాగే ఒక ఫ్యామిలీ కూడా వీకెండ్ సరదాగా గడపడానికి ఒక కార్ లో ఒక ఫామ్ హౌస్ కు వెళ్లారు.

 Strange Sounds In The Car Whats Inside The Car Details,  Car, Different Sound's,-TeluguStop.com

అక్కడికి చేరుకోగానే తమ కారులో నుంచి తెచ్చుకున్న సామాన్లు అన్నీ బయటకి తీసి ఒక్కొక్కటిగా లోపల పెడుతున్నారు.అప్పుడే వాళ్ళకి ఒక చేదు అనుభవం ఎదురయింది.

కార్ లో ఏవో వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి.అక్కడ ఉన్నవారు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

కార్ లో మనుషులు ఎవ్వరు లేరు మరి కార్లో నుంచి వింత శబ్దాలు ఎలా వస్తున్నాయి అనే అనుమానం వచ్చి కార్ దగ్గరకు వెళ్లి చూడగా ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది.

మరి ఆ వ్యక్తులు అంతగా బయపడడానికి ఆ అసలు అక్కడ ఏం జరిగింది.? ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఒక కార్ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉండడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు.కార్ లో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని కార్ దగ్గరకి ఆ ఇద్దరి వ్యక్తులు వెళ్లి కారు డోర్‌ను నెమ్మదిగా తెరవడం మనం వీడియోలో చూడవచ్చు.

డోర్ తెరిచే చూడగా ఒక్కసారిగా ఆ ఇద్దరూ వ్యక్తులు కంగుతిన్నారు ఎందుకంటే.! ఆ కారులో ఓక పెద్ద ఎలుగుబంటి ప్రవేశించింది.

బహుశా ఆ కార్ లో తినడానికి ఏమైనా దొరుకుతాయేమోననుకుని కారులోకి దూరి లోపల ఉన్న సామాన్లు అన్నీ చెల్లాచెదురు చేసింది.మెల్లగా ఇద్దరూ వ్యక్తులు కార్ డోర్ వేయగా ఆ ఇద్దరి వ్యక్తులను భయపెడుతూ కార్ డోర్ అద్దాన్ని సైతం బద్దలు కొట్టి మరీ బయటికి వచ్చేసింది.కొంచెంలో పెద్ద ప్రమాదం తప్పింది.ప్రస్తుతం ఈ ఎలుగుబంటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా అది కాస్తా నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

ఈ వీడియో చుసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పోస్ట్ చేస్తూ తెగ లైక్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube