శవం నుండి వింత శబ్దాలు… షాక్ కి గురైన ఫోటోగ్రాఫర్…!  

Kerala Photographer, Dead Body, Life, Kerala Photographer taking pics of Dead Man, Strange Sounds from Dead Body - Telugu Dead Body, Kerala Photographer, Kerala Photographer Taking Pics Of Dead Man, Life, Strange Sounds From Dead Body

కేరళలోని ఎర్నాకులం లో ఓ వింత సంఘటన జరిగింది.అసలు విషయం ఏమిటంటే… ఓ వ్యక్తి తన సొంత ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

 Strange Sounds From Dead Body Kerala Photographer

అయితే ఈ సంఘటన విషయాన్ని కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని గమనించారు.అయితే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సదరు వ్యక్తి శవానికి ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్ ని పోలీసులు పిలిచారు.

దాంతో సంఘటన స్థలానికి చేరుకొని శవానికి ఫోటోలు కాస్త దగ్గరగా తీస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్ కి శవం శరీరంలో నుండి వింత శబ్దాలు వినపడ్డాయి.

శవం నుండి వింత శబ్దాలు… షాక్ కి గురైన ఫోటోగ్రాఫర్…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో హడలిపోయిన ఫోటోగ్రాఫర్ వెంటనే కెమెరా పక్కన పడేసి అక్కడినుంచి పారిపోదామని అనుకున్నాడు.

కానీ, ఆ విషయాన్ని అక్కడే ఉన్న పోలీసులతో ఫోటోగ్రాఫర్ అతడు చనిపోలేదని ప్రాణాపాయ స్థితిలో మూలుగుతున్నాడని అతడు గ్రహించి ఈ విషయాన్ని తెలియజేశారు.ఇక వెంటనే కుటుంబ సభ్యులు, అలాగే పోలీసులు అతడిని హుటాహుటిన దగ్గరలోనే హాస్పిటల్ కు చేర్పించారు.

ఫోటోగ్రాఫర్ కి ఎదురైన వింత అనుభవం వల్ల ఓ నిండు ప్రాణం నిలబడినట్లు అయింది.

ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు.

తలకు గాయం అవ్వడం వల్ల సదరు వ్యక్తి సృహ తప్పి కింద పడి పోయాడని, దాంతో అందరూ అతడు చనిపోయాడని భావించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఇకపోతే అతడి తలకు ఎలా గాయం అయిందన్న విషయం పై దర్యాప్తు చేపడుతున్నారు.

ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు అతను జారిపడ్డాడా? లేదంటే ఎవరైనా అతని పై హత్యాయత్నం చేసారన్నా.? విషయం పై పోలీసులు కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.

#Dead Body #Life

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Strange Sounds From Dead Body Kerala Photographer Related Telugu News,Photos/Pics,Images..