వింత ఆచారం: అక్కడ కప్పలు విడాకులు తీసుకున్నాయి... ఎందుకంటే?

మీరు వింటున్నది నిజమే.కానీ కప్పలు విడాకులు ఏంటి? అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకోవచ్చు.ఇలాంటి వింత ఆచారాలు మన భారతీయ పల్లెల్లోనే కనిపిస్తాయి.వర్షాలు కురవక పోతే కప్పలకు పెళ్ళి చేసే ఆచారాన్ని గురించి మీరు వినే వుంటారు.ఇది కూడా అలాంటిదేనండి! కాకపోతే దానికి కాస్త వ్యతిరేక పద్ధతిలో దీన్ని జరుపుతారు.వర్షాలు ఎక్కువగా కురిసి, వరదలు ఉప్పొంగి గ్రామాలను ముంచేసే పరిస్థితి వస్తే పెళ్లి చేసిన కప్పలను విడదీస్తారు.

 Strange Ritual: There Frogs Get Divorced Frog,  Marrege , Divorce, Traditional,-TeluguStop.com

అంటే ఆ కప్పలకు విడాకులు ఇస్తారన్నమాట.ఇక దీనికంతటికీ వరణుడే కారణం.

ఏది ఏమైనా కప్పలకు విడాకులేమిటి అని అనుమానం కలగక మానదు.వివరాల్లోకి వెళితే, భారత దేశంలోని కొన్ని గ్రామాల్లో వర్షాలు కురవనట్లైతే ఓ 2 కప్పలను తెచ్చి వాటికి పెళ్ళి చేసి, ఊరంతా వాటిని ఊరేగిస్తారు.

ఆ తరువాత వాటిని దగ్గర్లోని చెరువులల్లో విడిచి పెడతారు.ఇలా చేయడం ద్వారా వరుణ దేవుడు కరుణించి.వర్షాలు కురిపిస్తాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం.అదే గ్రామాలలో వర్షాలు ఎక్కువగా కురిసి, వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లయితే అదే కప్పలకు విడాకులు కూడా ఇస్తారు.

అయితే ముఖ్యంగా భోపాల్ లో ఈ కప్పల విడాకుల పద్ధతి గురించి మాట్లాడుకుంటారు.

Telugu Divorce, Frog, Marrege, Traditional, Latest-Latest News - Telugu

అంటే కాదండోయ్ దీనిని కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు.ఈసారి పట్టుకున్న రెండు కప్పలలో ఆడకప్పకు ఓ రకం బట్టలు, మగ కప్పకు ఓ రకం బట్టలు వేసి, ఆడ కప్పకు పసుపు కుంకుమ పెడతారు.తరువాత వాటికి పెళ్లి చేసి ఒకే చెరువులో వదులుతారు.

ఆ తరువాత రెండిటికీ విడాకులు అయినట్టుగా రెండు వేరు వేరు చెరువుల్లో విడిచిపెడతారు.అలాచేయడం వలన వర్షాలు తగ్గుతాయని వారి నమ్మకం.

ఇకపోతే దేశంలో కొన్నిచోట్ల ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube