ఇండియాలోనే మొదటి సారి అరుదైన పెళ్లిలు... ఇకపై ఇలాంటివి కామన్‌ అవుతాయేమో  

Strange Marriages In First Time In India-

పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇండియాలో ట్రాన్స్‌ జెండర్స్‌ కాస్త తక్కువగా ఉంటారని చెప్పుకోవాలి.ఒక వేళ ఉన్నా కూడా వారు బయటి ప్రపంచంకు దూరంగా ఉంటారు.తమ జీవితాలకు ఇండియాలో గౌరవం ఉండదని వారు భావిస్తారు...

Strange Marriages In First Time In India--Strange Marriages In First Time India-

మగ, ఆడ కాని వారు అంటూ రకరకాలుగా చిత్రవదలు చేస్తారు.వేలల్లో మూడవ రకం మనుషులు ఉంటే, పదుల సంఖ్యలోనే బయట కనిపిస్తూ ఉంటారు.అయితే మారుతున్న పరిస్థితుల కారణంగా పదుల సంఖ్య కాస్త వందల సంఖ్యలోకి మారుతుంది.

ట్రాన్స్‌ జెండర్లం అంటూ కొందరు గర్వంగా చెప్పుకు తిరుగుతున్న రోజులు రాబోతున్నాయి.

Strange Marriages In First Time In India--Strange Marriages In First Time India-

విదేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ట్రాన్స్‌ జెండర్లు పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం జరుగుతుంది.తాజాగా ఇండియాలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ వివాహం జరిగింది.

ఛతీస్‌ ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ వింతైన వివాహం జరిగింది.ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 15 జంటలు తాజాగా ఏకం అయ్యాయి.ఆ పదిహేను జంటల్లో కూడా వధువు ట్రాన్స్‌ జెండర్‌ అవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి ట్రాన్స్‌ జెండరర్‌ల వివాహాలు జరగడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు మరియు మారుతున్న టెక్నాలజీ వీటన్నింటి నేపథ్యంలో మరో పాతిక సంవత్సరాల తర్వాత ట్రాన్స్‌ జెండర్స్‌ పెళ్లి చేసుకున్నారట అంటే కామనే కదా అనే పరిస్థితి వస్తుంది.ప్రస్తుతం ఒక ట్రాన్స్‌ జండర్‌ జెంట పెళ్లి చేసుకుంటే వార్త అవుతుంది.కాని అప్పుడు అది మామూలు విషయం అవుతుంది.అందరు పెళ్లి చేసుకున్నట్లుగా వారు పెళ్లి చేసుకున్నారు, అందులో వింత ఏముంది అంటారేమో.

మారుతున్న కాలంతో పాటు మనం మారక పోతే బాగుండదని ట్రాన్స్‌ జెండర్‌ల పెళ్లిలకు పెద్దలు కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.