విచిత్రం.. చేప‌ల‌ను తింటున్న మేక‌..

ఈ సృష్టిలో ప్ర‌తి జంతువుకు కూడా కొన్ని ఆహార నియ‌మాలు అనేవి ఉన్నాయి.అవి ఆ త‌ర‌హా ఆహారాన్ని మాత్ర‌మే తింటాయి.

 Strange A Goat Eating Fish-TeluguStop.com

ఉదాహ‌ర‌ణ‌కు సాధు జంతువులు గ‌డ్డి మాత్ర‌మే తింటాయి.క్రూర మృగాలు మాంసం మాత్ర‌మే తింటాయి.

అవి లేక‌పోతే ఇంకేవి తిన‌కుండా అలాగే చ‌నిపోతాయి త‌ప్ప వేరే వాటిని మాత్రం తిన‌వు.కాగా కొన్ని సార్లు మ‌నం చూస్తుంటే ప్ర‌కృతి నియ‌మాల‌కు విరుద్ధంగా జ‌రుగుతోంది.

 Strange A Goat Eating Fish-విచిత్రం.. చేప‌ల‌ను తింటున్న మేక‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయా జంతువులు వాటి ఆహారాన్ని కాకుండా ఇత‌ర ఆహారాల‌ను కూడా తింటున్నాయి.మొన్న‌టికి మొన్న తాబేలు ప‌క్షుల‌ను తిన‌డం ఎంత‌లా వైర‌ల్ అయిందో తెలుసు.

కాగా ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వీడియోనే ట్రెండ్ అవుతోంది.అదేంటంటే మేక‌లుకు సంబంధించింది.సాధార‌ణంగా మేకలు గడ్డి లేదంటే ఆకులు మాత్ర‌మే తింటాయి.కానీ చేపలు తిన్నాయని చెబితే ఎవ్వ‌రూ న‌మ్మ‌రు క‌దా.కానీ ఇది నిజ‌మేనండి ఓ మేక చేపలు తింటుంది.ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న వీడియోలో చూస్తే కొన్ని చేపలను ఓ బుట్టలో వేసి మేక ముందు పెడ‌తారు.

ఇక దాన్ని గ‌మ‌నించిన ఆ మేక ఒక్కో చేపను నోటితో పట్టుకొని మింగేస్తుంది.ఇంకా విచిత్రం ఏంటంటే ఎంతో టేస్టీగా ఉంద‌న్న‌ట్టు న‌ములుతూ తినేస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మేక‌లు ఇలా మాంసాహారాన్ని తిన‌డం ఎప్పుడూ చూడ‌లేదు.గానీ ఈ మేక మాత్రం ఇలా చేపల‌ను తినడం మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తోంది.

ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా విప‌రీతంగ‌తా వైరల్ అవుతోంది.ఇప్ప‌టికే ఈ వీడియోను లక్ష‌లాది మంది చూశారు.

చూసిన నెటిజ‌న్లు అంద‌రూ కూడా లైకులు, కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.అతి త‌క్కువ టైమ్‌లోనే ఈ వీడియో ట్రోల్ అవుతోంది.

దీన్ని చూసిన వారంతా అంటున్న మాట ఏంటంటే ఒక మేక ఇలా ఫిష్ తినడం ఇదే మొదటిసారి చూస్తున్నాం అని చెబుతున్నారు.

#Goat #Fish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు