కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది సినిమా థియేటర్లు మూత పడ్డాయి.ఇప్పుడిప్పుడే థియేటర్ లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటుండడంతో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి.
సినిమాలకు పూర్తిగా దూరమైన ప్రేక్షకులకు ఈ ఏడాది కాస్త వినోదం లభించింది.ఇక 2021 డిసెంబర్ లో ఏ సినిమాలు విడుదల అవుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
మరొక సినిమా స్పైడర్ మ్యాన్:నో వే హోమ్ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది.ఈ సినిమా ఇంగ్లీష్ తోపాటు హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించారు.వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గని.ఈ సినిమాతో కిరణ్ కొర్లపాటి దర్శకుడిగా వెండి తెరకు పరిచయం కాబోతున్నారు.బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారత క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 83.ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.అలాగే అక్షయ్ కుమార్, ధనుష్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం అత్రంగి రే.ఈ సినిమా ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది.2019లో తెలుగులో నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాను బాలీవుడ్ లో అదే పేరుతో రీమేక్ చేశారు.ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది.ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటించారు.