హాన్సిక మూవీ ఒటీటీ రిలీజ్ పై కోర్టుకి ఎక్కిన దర్శకుడు

దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి హాన్సిక మొత్వానీ.ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలు అందరితో ఇంచుమించు చేసిందని చెప్పాలి.

 Str And Hansikas Maha Release Controversy-TeluguStop.com

ఇక తెలుగులో అవకాశాలు తగ్గిపోయిన సమయంలో కోలీవుడ్ లో ఈ బ్యూటీ బిజీ అయిపొయింది.సౌత్ లో ఈ జెనరేషన్ లో చాలా మందికి సాధ్యం కాని 50 సినిమాల రికార్డ్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది.

ఈ బ్యూటీ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికి 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె నటించిన 50వ సినిమా మహా వివాదంలో చిక్కుకుంది.

 Str And Hansikas Maha Release Controversy-హాన్సిక మూవీ ఒటీటీ రిలీజ్ పై కోర్టుకి ఎక్కిన దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిర్మాతలు మహా మూవీని ఒటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.అయితే దీనిపై ఇప్పుడు చిత్ర దర్శకుడు కోర్టులో పిటీషన్ వేశాడు.

శింబు-హన్సిక జంటగా తెరకెక్కిన ఈ మూవీని యు.ఆర్.జమీల్ దర్శకత్వం వహించాడు.అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ పై ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు.

తనకు తెలియకుండానే ఈ చిత్రం పెండింగ్ పనులు పూర్తి చేశారని నిర్మాతపై కేసు పెట్టారు.అలా రిలీజ్ కానివ్వకుండా నిర్మాణ సంస్థపై నిషేధాన్ని దాఖలు చేశాడు.అంతేకాదు ఈ సినిమా పెండింగ్ చిత్రీకరణకు సంబంధించి ఏదీ తన అనుమతి తీసుకోలేదని దర్శకుడు ఆరోపించారు.కథకు అవసరమైన సన్నివేశాలను పరిగణనలోకి తీసుకోకుండా సినిమాలోని కొన్ని భాగాలను తన అసిస్టెంట్ డైరెక్టర్ చిత్రీకరించారని దర్శకుడు ఆరోపించారు.

ఇష్టానుసారంగా కథలు మార్పులు చేసి తనకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రిలీజ్ చేస్తున్నారని అన్నారు.అలాగే సినిమా కోసం తనకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా పూర్తిగా చెల్లించలేదని ఆరోపించారు.

తక్షణం మహా మూవీ రిలీజ్ ని నిలిపేయాలని డిమాండ్ చేశాడు.మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం చెబుతుందో అనేది ఇప్పుడు చూడాలి

.

#Kollywood #UR Jameel #Hansika #MAHARelease

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు