విమానం నుండి కింద పడ్డ వ్యక్తి.. భూమి మీద ఉన్న వ్యక్తికి తృటిలో తప్పిన ప్రమాదం  

Stowaway Falls Into London Garden From Kenya Airways Plane-

టైటిల్‌ చూసి ఆశ్చర్య పోయారా.విమానం నుండి మనిషి కింద పడటం ఏంటా అంటూ అవాక్కవుతున్నారు.నిజంగానే విమానం నుండి ఒక వ్యక్తి కింద పడ్డాడు.నైరోబీకి చెందిన కెన్యా ఎయిర్‌ వేస్‌ విమానం లండన్‌కు వెళ్లింది.లండన్‌ లో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు ల్యాండింగ్‌ గేర్‌ విభాగం ఓపెన్‌ చేయడం జరిగింది.

Stowaway Falls Into London Garden From Kenya Airways Plane--Stowaway Falls Into London Garden From Kenya Airways Plane-

ఆ సమయంలోనే ఒక వ్యక్తి అందులోంచి కింద పడ్డాడు.ఆ వ్యక్తి ఒక వ్యక్తి సన్‌ బాత్‌ చేస్తుండగా కొద్ది మీటర్ల దూరంలో పడటం జరిగింది.

Stowaway Falls Into London Garden From Kenya Airways Plane--Stowaway Falls Into London Garden From Kenya Airways Plane-

ఆ శబ్దంకు అవాక్కయి వెంటనే అటువైపు చూడగా ఒక వ్యక్తి పై నుండి కింద పడ్డాడు.

అప్పుడే విమానం వెళ్తుండటంను గమనించిన ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇతడు ఆ విమానం నుండి పడి ఉంటాడు అని భావించాడు.వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విమానాశ్రయ సిబ్బందిని మరియు ఇతర అధికారులను సంప్రదించగా అతడు కెన్యా నుండి అక్రమంగా లండన్‌కు వచ్చేందుకు ప్రయత్నించాడు.

విమానంలోని గేర్‌ విభాగంలో తల దాచుకున్నాడు.అప్పటి వరకు బాగానే ఉన్న అతడు హఠాత్తుగా విమానం గేర్‌ విభాగం ఓపెన్‌ అవ్వడంతో అందులోంచి జారి పడ్డాడు.

అత్యంత ప్రమాదం అని తెలిసి కూడా అతడు ఈ పని చేశాడంటూ విమాన సిబ్బంది అంటున్నారు.ఇలా గతంలో కూడా ఒకరు ఇద్దరు విమానంలో అక్రమంగా ప్రయాణించేందుకు ప్రయత్నించారు.అయితే వారిని ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు తీయగలిగారు.కాని ఈసారి మాత్రం విమాన సిబ్బంది అతడిని గమనించలేదు.గేర్‌ విభాగం ఓపెన్‌ అయ్యే సమయంలో అతడు ఆదమర్చి ఉండటంతో ఓపెన్‌ చేయగానే కింద పడి పోయాడు.

లండన్‌ అధికారులు ఈ విషయాన్ని కెన్యా ఎంబసికి చెప్పడం జరిగింది.

అతడు కింద పడ్డ స్థలంలో భూమి కుంగిందని చూసిన వ్యక్తి అంటున్నాడు.కాస్త ఇటుగా పడి ఉంటే తనపై పడే వాడని, తాను అతడి దాటికి మృతి చెందే వాడిని అంటూ ప్రత్యక్ష సాక్షి అంటున్నాడు.