గ్యాస్ అవసరమే లేని స్టవ్.. ఆశ్చర్యపోతున్న ప్రజలు!

ఈ రోజుల్లో గ్యాస్ ధరలు భారీ ఎత్తున పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు కట్టెల పొయ్యి వెలిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Stove That Does Not Require Gas  People Are Surprised , Gas , Bill , Stove ,  S-TeluguStop.com

అయితే వీటికి ఆల్టర్నేటివ్ స్టవ్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.వాటిలో సోలార్ స్టవ్ అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఒక అద్భుతమైన సోలార్ స్టవ్ లాంచ్ అయ్యింది.దీనిని మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చు.

గ్యాస్, కరెంట్ ఇలా ఏ ఇంధనం అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది.వన్ టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఆల్ టైమ్‌ యూజ్‌బుల్‌గా ఈ స్టవ్ కొనుగోలుదారులకు ఉపయోగపడుతుంది

ఈ స్టవ్‌ను బయట పెట్టాల్సిన అవసరం లేదు.

మీరు మీ కిచెన్ లో ఉంచి దీనిని ఏ సీజన్‌లోనైనా వాడుకోవచ్చు.సూర్య నూతన్ పేరుతో లాంచ్ అయిన ఈ స్టవ్‌ ధర రూ.12 వేలుగా నిర్ణయించారు.అంటే ఈ డబ్బుతో దాదాపు 12 సిలిండర్లు కొనుగోలు చేయవచ్చు.

ఈ సిలిండర్లతో మామూలు యూజర్లు అయితే మూడు సంవత్సరాల వరకు గ్యాస్ స్టవ్ వాడుకోవచ్చు.కానీ ఇదే డబ్బులతో కొనుగోలు చేసే ఈ సోలార్ స్టవ్ తో జీవితాంతం ఫ్రీగా వంట చేసుకోవచ్చు.

ఫరీదాబాద్ కి చెందిన ఇండియన్ ఆయిల్ ఈ కొత్త స్టవ్ డిజైన్‌ను డెవలప్ చేసింది.

కంపెనీ చెప్పిన ప్రకారం ఈ స్టవ్ ప్రీమియం మోడల్ తో నలుగురు ఉన్న కుటుంబం 3 సార్లు వంట వండుకోవచ్చు.

శీతాకాలం, వర్షాకాలంతో వాతావరణ పరిస్థితులతో పాటు సూర్య కాంతి తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ స్టవ్ పనిచేస్తుందట.సూర్యుడు కాంతిని ప్రసరింపచేసేటప్పుడు ఇన్వర్టర్ వలె ఇది కొంత ఎనెర్జిని స్టోర్ చేసుకుని సూర్య కాంతి లేని రాత్రి సమయాల్లో పని చేస్తుంది.

ఇందులో అందించిన రీఛార్జబుల్ బ్యాటరీ మన్నికైనదని కంపెనీ చెబుతోంది.

Telugu Gas Require Gas, Solar Stove, Stove, Latest-Latest News - Telugu

ఈ స్టవ్‌తో పాటు ఒక కేబుల్, సోలార్ ప్లేట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది.ఈ సోలార్ ప్లేట్ ఉత్పత్తి చేసే సోలార్ ఎనర్జీ కేబుల్ ద్వారా స్టవ్‌కి చేరుకుంటుంది.సోలార్ ప్లేట్ థర్మల్ బ్యాటరీలో సోలార్ ఎనర్జీ స్టోర్ అవుతుంది.

అలా ఎనర్జీ చేసుకుంటూ వంట వండుకోవచ్చు.దీని గురించి తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube