'శబరిమల అయ్యప్ప' ప్రసాదం మీకు ఇష్టమా..? అయితే అరవణి ప్రసాదం గురించి ఈ 11 నిజాలు తప్పక తెలుసుకోండి!

చలిలో కూడా చాలా నిష్టగా తెల్లవారుఝామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజకి కూర్చుంటారు కొందరు నల్లబట్టలతో.అదేనండి స్వాములు అంటాం మనం.

 Story Of The Famous Sabarimala Ayyappa Prasadam-TeluguStop.com

అయ్యప్పమాల దీక్ష చేస్తూ 41రోజుల దీక్ష పూర్తి అయిన తర్వాత ఇరుముడి కట్టుకుని శబరిలో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరుతారు.మనవాళ్లల్లో కూడా స్వాములు అలా వెళితే వాళ్లు క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడం తో పాటు వారు తెచ్చే ప్రసాదం కోసం కూడా చాలా ఎదురుచూస్తాం…పాకంలా నల్లగా డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండి దాన్ని తింటుంటే అబ్బా చాలా టేస్టీగా ఉంటుంది కదా…చెప్తుంటేనే నోరూరుతుందా.

ఆ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు మీకోసం…

1.అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న స్వాములు తీసుకొచ్చే అయ్యప్ప ప్రసాదం పేరు అరవణి ప్రసాదం .

2.స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు అరవణ పాయసం, అప్పం తప్పకుండా తీసుకుంటారు.

3.బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ఈ ప్రసాదం తయారు చేస్తారు.అనేక పోషక పదార్ధాల మిలితం అయిన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

4.చలికాలంలో అరవణి ప్రసాదం తింటే శరీరంలో వేడిని కలిగిస్తుంది.

5.ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి.

6.ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని కనీసం రెండు నుంచి పది లక్షల మండి దర్శించుకుంటారని అంచనా.

7.భక్తుల కోసం ప్రతి ఏడాది 80 లక్షల అరవణ ప్రసాదాన్ని తయారు చేస్తారట.

8.తిరుమల తరువాత అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల కావడం విశేషం.తిరుమల లడ్డు తర్వాత అరవణి ప్రసాదానికి అంత పేరుంది.

9.దేవస్వామ్ బోర్డు పరిధిలోని మావెలిక్కర చెట్టికులంగర దేవి ఆలయం నుంచి ప్రసాదం తయారీకి అవసరమైన బియ్యం సరఫరా అవుతాయి.

10.ఒక్కో డబ్బా 250 గ్రాముల బరువు ఉంటుంది.

11.ప్రసాదం తయారీకి సంబంధించి నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకుగాను మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ సభ్యులను సలహాదారులుగా దేవస్వామ్ బోర్డు నియమించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube