విడ్డూరం : ద్రౌపతులు ఇప్పటికి ఉన్నారంటే నమ్ముతారా? లేదంటే ఇది చదవండి  

A Story Of Real Life Draupadis In Himachal Pradesh-brothers,draupadis,himachal Pradesh,mahabharatam

మహాభారతంలో ద్రౌపతికి అయిదుగురు భర్తలు ఉంటారు.అన్నదమ్ములు అయిన పంచ పాండవులు అంతా కలిసి ఒకే భార్యను వివాహం చేసుకున్నారు.

A Story Of Real Life Draupadis In Himachal Pradesh-Brothers Draupadis Himachal Pradesh Mahabharatam

మహాభారతంలోనే అదో కీలకమైన విషయం.మహాభారతంలో కాకుండా మరెక్కడ కూడా అయిదుగురు భర్తలు ఉండే భార్య ఉండదని మనం ఇంత కాలం అనుకున్నాం.

మగవారికి అయిదుగురు భార్యలు ఉండగా మనం చూశాం.కాని అయిదుగురు భర్తలను కలిగి ఉన్న భార్యలను మాత్రం ఇప్పటి వరకు చూసి ఉండం.

అయిదుగురు భర్తలు కలిగిన భార్యలు ఉండరేమో అనుకున్నాం.కాని అది నిజం కాదు.ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల మంది అయిదుగురు భర్తలు కలిగిన ఆడవారు అక్కడ ఉన్నారు.వందల మంది ఆడవారికి ఇద్దరు లేదా ముగ్గురు భర్తలు ఉన్నారు.

ఇది ఎక్కడో ప్రపంచంలో మూలకు ఏదో అడవుల్లో ఉన్న మనుషుల గురించి కాదు.మన ఇండియాలోనే హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో శివారు ప్రాంతంలో ఉండే ఒక ప్రాంతంలో ఈ ద్రౌపతులు ఉన్నారు.

పూర్వ కాలం నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం అక్కడ ఒక ఇంటికి చెందిన అబ్బాయిలు అంతా కూడా ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు.అంటే ఒక ఇంట్లోని అన్నదమ్ములు అంతా కూడా ఒకే భార్యను కలిగి ఉంటారు.

వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది గత రెండు వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తుందని, అప్పట్లో తాతలు ముత్తాతలు చేసుకున్నారు.ఇప్పుడు మేము కూడా అదే పద్దతిని కొనసాగిస్తున్నట్లుగా ఆ ప్రాంతంకు చెందిన వారు చెబుతున్నారు.

ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉంటే వారంతా కూడా ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా సంసారాన్ని సాగిస్తూ ఉంటారు.ఇంకా మీకు నమ్మకం కలుగకుండా ఎప్పుడైనా హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్తే ఆ ప్రదేశంకు వెళ్లి ఒకసారి చూసి రండి.

.

తాజా వార్తలు

A Story Of Real Life Draupadis In Himachal Pradesh-brothers,draupadis,himachal Pradesh,mahabharatam Related....