గడ్డం బాబుల గడ్డం వెనుక ఇంత స్టోరీ ఉందా..?!

Story Behind The Kerala Beard Men For The Society

ఎవరయినా మగవాళ్ళు గడ్డం పెంచుకుంటే వారిని విచిత్రంగా చూస్తాము కదా.ఏంటి ఇతను గడ్డాన్ని పెంచుకుంటున్నాడు.

 Story Behind The Kerala Beard Men For The Society-TeluguStop.com

ప్రేమలో ఏమయినా ఫెయిల్ అయ్యాడా లేక మరే ఇతర సమస్యలు అయిన ఉన్నాయా అనే ఆలోచనలో ఉంటాము.మరి కొందరు కావాలని స్టైల్ కోసం గడ్డం పెంచుతున్నారని అనుకుంటాము.

అయితే కొందరు గడ్డం బాబుల మాత్రం తమ గడ్డాలను భారీగా పెంచి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.ఒకరు ఇద్దరూ అయితే పర్వాలేదు.

 Story Behind The Kerala Beard Men For The Society-గడ్డం బాబుల గడ్డం వెనుక ఇంత స్టోరీ ఉందా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పదుల సంఖ్యలో గడ్డం బాబులు గడ్డాలను పెంచుతున్నారు.ఇంకో విచిత్రం ఏంటంటే ఈ గడ్డం బాబులు అందరి కోసం ఒక సొసైటీ కూడా ఉంది.

ఇప్పుడు ఈ గడ్డం బ్యాచ్ ను చూసి మరికొందరు కూడా వీరి బాటలోనే పయనిస్తున్నారు.మరి ఈ గడ్డం బాబులు ఎందుకు ఇలా గడ్డాలను పెంచుతున్నారు.? అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు.? ఏంటి అనే వివరాలు చూద్దామా.!

సాధరణంగా ఎవరయినా భారీగా గడ్డం పెంచితే వారిని చూసి పలురకాలుగా అనుకుంటూ ఉంటాము.కానీ వీళ్ళు మాత్రం ఎదుటివాళ్ళు ఏమి అనుకుంటే మాకేంటి అని గడ్డాలను పెంచుకుంటున్నారు.

వీళ్ళు ఇలా గడ్డాలను పెంచడం వెనుకస్టోరీ కూడా ఉందని అంటున్నారు.అదేమిటంటే మగవాళ్ళు గడ్డం పెరిగితే షేవింగ్ చేయించుకుంటారు కదా.అయితే వీళ్ళు అలా గడ్డం పెరగగా షేవింగ్ చేసుకోకుండా వచ్చే డబ్బులను ఆదా చేసి పొదుపు చేస్తున్నారు.

Telugu Anas Abdulla, Kerala Beard, Keralabeard, Latest, Malappuram, Society, Story-Latest News - Telugu

అలా వచ్చిన డబ్బుతో ఈ గడ్డం బాబులసామాజిక సేవ చేస్తున్నారు.అందుకోసం ఓ సొసైటీని కూడా స్థాపించారు.ఈ సొసైటీ కేరళలో కలదు.

కేరళలోని వివిధ జిల్లాల్లో ఉన్నవారు దీనిలో సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు.

కేరళలోని మలప్పురానికి చెందిన అనాజ్ అబ్దుల్లా అనే వ్యక్తి ఈ సంస్థను 2017లో స్థాపించారు.

ఈ క్రమంలోనే ఇలా గడ్డం పెంచడంలో తమకు ఎటువంటి ఇబ్బంది లేదని అంటున్నారు ఈ సొసైటీలోని సభ్యులు.

Telugu Anas Abdulla, Kerala Beard, Keralabeard, Latest, Malappuram, Society, Story-Latest News - Telugu

మొదట్లో తమ గడ్డాన్ని చూసి ఇంట్లో వారితో పాటు చుట్టుపక్కన ఉన్నవారు కూడా వింతగా చూసేవాళ్ళు అని, కానీ ఇప్పుడు తాము చేసే మంచి పనులు చూసి వారు కూడా రియలైజ్ అయ్యారని చెప్తున్నారు.ఒకవేళ ఏదైనా పని మీద బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమని చిత్ర విచిత్రంగా చూసేవారని ఆ సొసైటీ లోని ఒక సభ్యుడు వివరించారు.కానీ ఇప్పుడు తాము అవేవీ పట్టించుకోవడం లేదు అని తెలిపారు.

ఎవరు ఏమనుకున్నా మేము మాత్రం షేవింగ్ చేసేది లేదని అంటున్నారు ఈ గడ్డం గ్యాంగ్.

#Malappuram #Kerala Beard #KeralaBeard #Society #Anas Abdulla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube