ఎన్టీఆర్ పిసినారి అని ముద్ర పడటానికి.. వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా?

నటనకు నిలువెత్తు రూపంగా పాత్రకు ప్రాణం పోసే గొప్ప నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా టాలీవుడ్ ఖ్యాతిని సినీ ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తిగా ఎన్నో రికార్డులు సృష్టించారు నందమూరి తారకరామారావు.ఆయన వేసిన ప్రతి అడుగు సంచలనమే ప్రతి నిర్ణయం ఒక సరికొత్త చరిత్ర సృష్టించిందే.

 Story Behind Senior Ntr Miserable Person Details, Senior Ntr, Miserable , Sr Ntr-TeluguStop.com

ఒక వైపు రాజకీయాల్లో మరో వైపు సినిమాలలో కూడా ఆయన నిర్ణయాలు సరికొత్త చరిత్రకు నాంది పలికాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అలాంటి ఒక గొప్ప వ్యక్తి అయిన ఎన్టీఆర్ కు పిసినారి అనే కామెంటు మాత్రం ఒకానొక సమయంలో నీడలా వెంటాడింది.

అయితే ఎన్టీఆర్ కు పిసినారి అనే పేరు ఎందుకు వచ్చింది అని ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మాత్రం ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.అడవి రాముడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చింతపల్లి అడవి ప్రాంతంలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

అక్కడ చలి ఎక్కువగా ఉండడంతో అన్నగారు కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారు.దీంతో ఇక సిగరెట్లు తప్ప చలి నుండి తనను ఏమి కాపాడలేవు అని భావించి జేబులో ఉన్న సిగరెట్ కాల్చేశారు.

అయినప్పటికీ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు చలి మాత్రం అంతకంతకూ ముదురుతోంది.

ఇక ఇంతలో అక్కడ ఉన్న ఒక బాయ్ ను పిలిచి సిగరెట్ పెట్టె తీసుకురమ్మని పది రూపాయలు ఇచ్చాడు.

Telugu Adavi Ramudu, Cigarette, Miserable, Senior Ntr, Sr Ntr, Season-Movie

అప్పట్లో గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ పెట్టి ధర ఎనిమిది రూపాయలు 75 పైసలు మాత్రమే.ఇక అబ్బాయి సిగరెట్ పెట్టె తీసుకువచ్చి అన్నగారు ఉన్న రూమ్ లో పెట్టి వచ్చాడు.ఇక అంతా ప్యాకప్ అయింది.ఎన్టీఆర్ రూమ్ కి వచ్చారు.టేబుల్ పై సిగరెట్ పెట్టి ఉంది కానీ మిగిలిన చిల్లర లేదు దీంతో మేనేజర్ ని పిలిచి సిగరెట్ తెచ్చిన బాయ్ ఎక్కడ అంటూ కోపంగా అడిగారు.ఇంతలో ఆ బాయ్ అక్కడికి వచ్చాడు.

అన్నగారు అతని దగ్గరికి పిలిచి చిల్లర ఏది అని అడిగేసరికి జేబులో ఎక్కడో దాచుకున్న రూపాయి పావలా టేబుల్ పై పెట్టి క్షమాపణ చెప్పాడు బాయ్.

Telugu Adavi Ramudu, Cigarette, Miserable, Senior Ntr, Sr Ntr, Season-Movie

ఇక ఇలా అప్పటి నుంచి ఎంతోమంది ఆయన ముందు అనే ధైర్యం లేకపోయినప్పటికీ వెనకాల మాత్రం ఎన్టీఆర్ పిసినారి అంటూ గుసగుసలు ఆడుకునే వారట.కానీ ఆ తర్వాత ఒక సినిమా సమయంలో దీనిపై వివరణ ఇచ్చారు ఎన్టీఆర్.చిల్లర నాకు పెద్ద విషయం కాదు కానీ డబ్బులు ముఖ్యం.

మన దగ్గర పనిచేసే వాళ్లకు డబ్బులు విలువ తెలియాలి అందుకే అలా చేసి వివరణ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube