విశ్వనాథ్ గారు షూటింగ్ లో ఖాకీ దుస్తులు ధరించడానికి కారణం ఏంటో తెలుసా?

కళాతపశ్వి కే విశ్వనాథ్ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించిన సంగతి తెలిసిందే.ఈయన మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.

 Story Behind Kalatapaswi K Vishwanath Wears Khaki Dress In Movie Shootings Detai-TeluguStop.com

ఈయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సాగర సంగమం స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులను సందడి చేశాయి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు నేడు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం.ఇక ఈయన కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా దాదాపు తొమ్మిది బాలీవుడ్ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు అదేవిధంగా బుల్లితెర సీరియల్స్ కి కూడా దర్శకుడిగా పనిచేశారు.

ఈయన దర్శకత్వంలో వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రం ఆత్మగౌరవం.ఇలా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా ఓ ఆణిముత్యమే అని చెప్పాలి.

Telugu Vishwanath-Movie

ఇక ఈయన మరణించిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు విశ్వనాథ్ గారితో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.ఇక గతంలో ఈయన దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంబంధించిన స్టిల్స్ కనుక చూస్తే ఈయన ప్రతిచోట కూడా ఖాకీ చొక్కా ధరించి కనిపిస్తారు.ఇలా ఈయన ఖాకీ చొక్కా ధరించి షూటింగ్ లొకేషన్లో పాల్గొనడానికి గల కారణం ఏంటి అని ఓ సందర్భంలో విశ్వనాథ్ గారిని ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెబుతూ

Telugu Vishwanath-Movie

దర్శకత్వం అనేది ఓ బాధ్యత.ఓ విధి.ఓ ఉద్యోగం లాంటిది అందుకే దాన్ని విధిగా ఆచరించాలనే ఉద్దేశంతోనే అలా యూనిఫామ్ లో కనిపిస్తానని తెలిపారు.ఇలా ఈయన సినిమాల పట్ల ఇంత డెడికేషన్ చూపిస్తారు కనుక ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube