బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినీ ఇండస్ట్రీలో అమితాబచ్చన్ ప్రస్థానం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడమేకాకుండా “కౌన్ బనేగా కరోడ్ పతి” కార్యక్రమం ద్వారా అభిమానులను మరింత సందడి చేస్తున్నారు.ఒక వైపు సినిమాలు, మరో వైపు టీవీ షోలు, అదే విధంగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా, మంచి గుర్తింపు పొందారు.
ఇదిలా ఉండగా బిగ్ బీ అమితాబచ్చన్ పేరు వెనక ఓ స్టోరీ దాగి ఉందనే విషయం మీకు తెలుసా? సాధారణంగా మనకు మన పేరుని ఎవరు పెట్టారంటే వెంటనే మనం మన తల్లి లేదా తండ్రి అని చెబుతాము.కానీ అమితాబ్ బచ్చన్ కి మాత్రం తన తల్లిదండ్రులు పేరు పెట్టలేదట.
మరి అమితాబచ్చన్ కు ఎవరు పేరు పెట్టారు అనే విషయానికి వస్తే.
అమితాబచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్, ప్రముఖ కవి, దివంగత సుమిత్రా నందన్ పంత్ మంచి స్నేహితులు.
వీరిద్దరు ఏదైనా ప్రత్యేక సందర్భాలు, ప్రత్యేక రోజులలో ఒకరింటికి ఒకరి వెళుతూ ఎంతో మంచి స్నేహభావంతో ఉండేవారు.ఈ క్రమంలోనే హరి వంశ రాయ్ బచ్చన్ కు అమితాబచ్చన్ జన్మించగా అతనికి నామకరణ దినోత్సవం రోజు సుమిత్రానందన్ కుటుంబాన్ని ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే సుమిత్రానందన్ అమితాబచ్చన్ మొహాన్ని తీక్షణంగా చూసి అతని ‘అమితాబ్’ అనే పేరును చెప్పడంతో తన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ కూడా తన కొడుకు అమితాబ్ అనే పేరును పెట్టారని తాజాగా అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి వేదికపై ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ విధంగా అమితాబ్ బచ్చన్ కు తన తండ్రి స్నేహితుడు సుమిత్రానందన్ చెప్పిన పేరు పెట్టినప్పటికీ, తన తండ్రి కలం పేరు తన ఇంటి పేరుగా మారిపోయిందని అందుకే తను అమితాబ్ బచ్చన్ గా మారి పోయిన విషయాన్ని అమితాబ్ గతంలో వ్యక్తిగత బ్లాగ్‌లో రాసిన విషయం తెలిసిందే. ఈ విధంగా అమితాబ్ అనే పేరుతో ఇండస్ట్రీ లోకి వచ్చిన నటుడు ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకొని బాలీవుడ్ మెగాస్టార్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఇక ఈయన నటన వారసులుగా తన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య బచ్చన్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.