Allu Arjun : అల్లు అర్జున్ మొదటి సినిమా విషయంలో ఇంత దారుణం జరిగిందా ?

గంగోత్రి..( Gangothri movie ).ఇది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కి వందవ సినిమ… అలాగే ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా ఐకాన్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న అల్లు అర్జున్ కి మొదటి సినిమా.ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.అయితే ఈ సినిమాకి కథ ఇచ్చిన చిన్ని కృష్ణ మొదట గీత ఆర్ట్స్ లో అల్లు అరవింద్ కి మొదట చెప్పాడట.

 Story Behind Allu Arjun Gangothri-TeluguStop.com

ఆ కథ నచ్చిన అల్లు అరవింద్ దానిని రాఘవేంద్రరావుకు వినిపించమని సూచించాడట.దాంతో అదే కథను రాఘవేంద్రరావుకి చిన్నికృష్ణ చెప్పగా అప్పటికే తన వందవ సినిమా కోసం ఆయన ఎన్నో కథలను వింటున్నాడు.

Telugu Allu Arjun, Allu Arvind, Chinni Krishna, Gangothri, Raghavendra Rao, Toll

అయితే ఆ కథలతో సంతృప్తి చెందని రాఘవేంద్రరావుకి ఇంద్ర సినిమాతో హిట్టు కొట్టిన చిన్ని కృష్ణ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది.దాంతో అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి ఆ కథతో లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.అలా అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటి సినిమాగా గంగోత్రి విడుదల అయింది.అయితే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ కి ఏ విధంగానూ ఉపయోగపడలేదు.

నటన పరంగాను, లుక్స్ పరంగా చాలా ట్రోల్ జరిగింది అల్లు అర్జున్ పై.కానీ కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా కథను చిన్ని కృష్ణ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Allu Arjun, Allu Arvind, Chinni Krishna, Gangothri, Raghavendra Rao, Toll

అవకాశాల కోసం కథలు పట్టుకొని తిరుగుతున్న ఒక చిన్న రైటర్ దగ్గర నుంచి మొదట చిన్నికృష్ణ ఈ సినిమా కథలో తీసుకున్నాడటలో చెప్పగా అల్లు అరవింద్ ఓకే చేశాడు.కానీ ఆ రైటర్ కి డబ్బులు ఇవ్వకుండా ఆ చిన్నికృష్ణ మాత్రం అల్లు అరవింద్ దగ్గర నుంచి భారీగానే డబ్బులు తీసుకున్నాడట.ఈ విషయం అప్పట్లో గొడవకు దారితీసింది.విషయం తెలిసిన దర్శక నిర్మాతలు ఆ వ్యక్తిని పిలిపించి గొడవ కాకుండా కొంత డబ్బు పంపించారట.ఇలా చాలామంది అవకాశాల కోసం తిరిగే రైటర్స్ దగ్గర స్టోరీలను దొంగతనం చేయడం కొంతవరకు జరుగుతున్నప్పటికీ చిన్ని కృష్ణ లాంటి ఒక పెద్ద దర్శకుడు ఇలా చేయడం మాత్రం నిజంగా బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube