ఫ్రిజ్‌తో పనిలేకుండా గాంగినా తోనే ఆహార పదార్థాల నిల్వ..!

సాధారణంగా మనం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు లాంటివి తాజాగా ఉండాలంటే ఫ్రిజ్ ను ఉపయోగిస్తూ ఉంటాం.అదే ఎండాకాలం ఐతే చాలు జ్యూస్, కూల్ వాటర్ కోసం ఫ్రిజ్ ను వాడుతాం.

 Storage Of Food Items With Gangina Without Working With Fridge Gangini, Instead,-TeluguStop.com

 కానీ ఆ ప్రాంతంలో వారు మాత్రం పండ్లు నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ ను ఉపయోగించరు.ఆ ప్రాంతంలో వారు కేవలం  పురాతనమైన సాంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తూ పండ్లను తాజాగా ఉండేలా నిల్వ చేసు కుంటూ ఉంటారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఆఫ్ఘనిస్తాన్ లోని అనేక ప్రాంతాలలో పండ్లను నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్ ను ఉపయోగించకుండా వారి పురాతనమైన సాంప్రదాయ పద్ధతిని పాటిస్తూ ఉంటారు.

ఏ పండ్లను అయినా కానీ వారు ఆరు మాసాల పాటు తాజాగా ఉండేందుకు ఉపయోగించే గాంగినా అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.ఈ పద్ధతిలో వారు తడి బంకమట్టితో తయారు చేసి వాటిలో తాజా పండ్లు ఉంచి , పండ్లలోకి  ఎటువంటి గాలి వెళ్ళకుండా వాటిని మూసివేస్తారు.

అది పూర్తిగా ఎండిపోయే వరకు వాటిని ఎండలో ఆరబెట్టి, ఎండిన బుట్టలను చీకటిగదుల్లో నిల్వ ఉంచుతూ ఉంటారు ఆ ప్రాంతంవారు. ఏవైనా పండ్లు దిగుబడి లేని సమయాలలో ఈ గాంగినా బుట్టలను ఉపయోగించి ఇందులో పండ్లను నిల్వచేసి తాజాగా ఉండే విధంగా వారు చూసుకుంటారు.

ఇక గాంగినా బుట్టలను తయారు చేసేటప్పుడు వారు అడుగుభాగాన్ని, పై భాగాన్ని రెండు పొరలుగా మట్టితో తయారు చేయడం ద్వారా వీటితో భద్రపరిచిన పండ్లు చాలాకాలంపాటు ఉండటంతోపాటు, అందులో భద్రపరిచిన పండ్లు చెడిపోకుండా ఉంటాయి.అలాగే ఈ బుట్టలలో పండ్లను నిల్వచేసేటప్పుడు ముందుగానే అతిగా మాగిన పండ్లను వేరు చేస్తామని లేకపోతే పాడయిపోతాయి అని ఆ ప్రాంతపు రైతు ఒకరు చెప్పుకొచ్చారు.

మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube