వైరల్: చేతకానప్పుడు మానేయాలి, గొప్పలకు పొతే ఇలాగే ఉంటుంది.. వైరల్‌ అవుతున్న వీడియో!

‘మనకి తెలిసిన పనిని ఫ్రీగా చేయకూడదు, తెలియని పనిలో వేలు పెట్టకూడదు’ అంటే ఇదే మరి.మనలో కొంతమంది ఎదుటివారి దగ్గర మార్కులు కొట్టేద్దామని గొప్పలకు పోయి, లేనిపోని తంటాలు కొనితెచ్చుకుంటారు.

 Stop When You Can Not, If It's Great, It's Like This . Video Going Viral Dam, Viral Latest, News Viral, Social Media, Viral Video, Men, Trying,-TeluguStop.com

ఎదుటివారి దగ్గర అభాసుపాలు అవుతారు.ఇక్కడ కూడా సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది.

ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సాహసం చేసాడు, కానీ మొదలుకే మోసం వచ్చింది.అది చిన్న పనేమీ కాదు, శృతి తప్పితే ప్రాణాలే పోయే అవకాశం వుంది.

 Stop When You Can Not, If It's Great, It's Like This . Video Going Viral Dam, Viral Latest, News Viral, Social Media, Viral Video, Men, Trying, -వైరల్: చేతకానప్పుడు మానేయాలి, గొప్పలకు పొతే ఇలాగే ఉంటుంది.. వైరల్‌ అవుతున్న వీడియో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ పెద్ద డ్యామ్ ఎక్కుతూ పట్టు తప్పి, అమాంతం కిందకు పడిపోయాడు.

వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌ను అందరూ చూస్తుండగా స్కేల్ చేయడానికి 20 ఏళ్ల యువకుడు యత్నించాడు.

అందరూ అతగాడికి ఎంకరేజ్ చేసారు.మంచి ఉత్సాహంతో పైకి ఎక్కాడు.

అయితే ఈ ప్రమాదకరమైన ప్రయత్నంలో అతను పట్టుతప్పి అమాంతం కిందికి జారిపడిపోయాడు.కట్ చేస్తే, ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు… అనుమతిలేని ప్రదేశంలో సాహసం చేయబోయి, ఇప్పుడు ఆసుపత్రిలో సేదతీరుతున్నాడు.

బెంగళూరు నుండి 74 కి.మీ దూరంలో ఉన్న ఈ డ్యామ్‌పైన నీరు ఎల్లప్పుడూ దిగువకు చాలా స్పీడుగా ప్రవహిస్తూ ఉంటుంది.దీన్ని పర్యాటకులు, స్థానికులు ఎక్కువగా సందర్శిస్తుంటారు.అదే సమయంలో ఈ యువకుడు డ్యామ్ గోడ ఎక్కుతున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు.అక్కడ నిలబడిన చాలా మంది ఈ ప్రమాదకరమైన ఫీట్‌ని కళ్ళార్పకుండా చూస్తుంటారు.దాదాపు 50 అడుగుల ఎత్తు ఉన్న ఆనకట్ట గోడపైన అతను దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత, అమాంతం జారిపడతాడు.

ఇలా చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా గోడ ఎక్కడానికి ప్రయత్నించిన యువకుడిపై ఇప్పుడు కేసు నమోదైంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube